Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూం నిర్మాణం ఇలా ఉంటే ఆర్ధికంగా అస్సలు సమస్యలు రావు!

ఒకప్పటి కాలంలో బాత్రూంలు ఇంటికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా హాల్ రూమ్ లో కానీ బెడ్రూంలో కానీ బాత్రూంలను నిర్మిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 07:04 PM IST

ఒకప్పటి కాలంలో బాత్రూంలు ఇంటికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా హాల్ రూమ్ లో కానీ బెడ్రూంలో కానీ బాత్రూంలను నిర్మిస్తున్నారు. బాత్రూంలు ఇంట్లో కంటే బయట ఉండటమే చాలా మేలు. నిజానికి బాత్రూం నిర్మాణంలో కూడా కొన్ని వాస్తులు ఉంటాయి. ఆధునిక వాస్తు శాస్త్ర ప్రకారం వాయువ్య మూలలో బాత్రూం నిర్మించడం శ్రేష్టకరం. అంతేకాకుండా ఆగ్నేయ దిశల్లో కూడా నిర్మించవచ్చు.

ముఖ్యంగా నైరుతి, ఈశాన్య దిశలలో అసలు ఉండకూడదు. ఒకవేళ ఓపెన్ ప్లేస్ లో బాత్రూం నిర్మించినప్పుడు నైరుతి లో నిర్మించుకోవచ్చు. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. ఇక లావెట్రీ బేసిన్ మీద కూర్చున్న వ్యక్తి ముఖం ఉత్తర, దక్షిణ వైపు మాత్రమే ఉండాలి. ఇక స్నానపు గదులలో కుళాయిలు ఎప్పుడూ తూర్పు, ఉత్తర గోడలకు మాత్రమే అమర్చుకోవాలి. వేడినీటి గీజర్స్ స్నానాల గది పై భాగంలో ఆగ్నేయంలో ఉండాలి.

ఇక బయటకు వెళ్లే నీటి పైపులు దక్షిణం ఆగ్నేయంలో, ఉత్తరం ఈశాన్యంలో ఉండాలి. బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కు బాత్ రూమ్ ఫ్లోరింగ్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణ బాత్రూంలో గాజు అద్దం తూర్పు ఈశాన్యం వైపు మాత్రమే ఉండాలి. ఇక ఉత్తరం బాత్రూంలో ఈశాన్యం, ఆగ్నేయం లో ఉన్న పర్వాలేదు. హాల్లోకి బాత్రూం వాకిలి రాకుండా ఉండాలి. లేదంటే దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా బాత్రూంలో ఉప్పు ఉంచితే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.