Own House: సొంతింటి కల నెరవేరాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అన్నది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడుతూ ఉంటారు. సొంత

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 07:15 PM IST

జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అన్నది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడుతూ ఉంటారు. సొంతింటి కల కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇంటి కల అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని చెప్పవచ్చు. అందుకే చాలా మంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతున్నారు. పెద్ద నగరాల్లో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. మీకు సొంతింటి కల ఉంటే వెంటనే ఈ పరిహారాలు పాటించడం వల్ల ఆ కాలంలో నిజం చేసుకోవచ్చు..

సొంతింటి కల కోసం పాటించాల్సిన ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా మీకు శని దేవుని అనుగ్రహం కావాల్సిందే. మీకు శని అనుగ్రహం కావలసి ఉంటుంది. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కుగా శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో రోజు ఆవనూనె దీపం వెలిగించి తప్పకుండా శని స్తోత్రం చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.అలాగే వేపచెక్కతో చిన్న ఇంటిని చేసి పేద పిల్లలకు దానం చెయ్యాలి.

ఇంట్లోని దేవతారాధన స్థలంలో చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల సొంతింటి కల నెరవేరి ఇంటికి యజమాని అవుతారు. అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంతింటి కల ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్టించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవు, దూడకు పప్పు, బెల్లం తినిపించాలి. ఇలా చెయ్యడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కోరుకున్న కల కూడా నెరవేరుతుంది. అలాగె అద్దె ఇంట్లో పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి.

ఉదయం సాయంత్రం ఇక్కడ పూజలు చేయాలి. ఈదిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సాకారం అవుతుంది. మీరు నివసించే ఇంటి బాల్కని లేదా ఆరుబయట పక్షిగూటిని ఏర్పాటు చేసి అందులో నివసించేందుకు పక్షులు చేరితే వాటికి గింజలు వెయ్యడం నీళ్లు పెట్టడం వల్ల కూడా సొంత ఇల్లు చేకూరుతుంది.