Site icon HashtagU Telugu

Vasthu Tips: ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో డబ్బుకు అసలు లోటే ఉండదు!

Vasthu Tips

Vasthu Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంపాదించిన డబ్బులు సరిపోక పోగా పైగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బులు మాత్రం చేతిలో నిలవడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలా డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? చేతిలో డబ్బులు మిగలడం లేదని దిగులు చెందుతున్నారా? అయితే ఇది మీకోసమే.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పని చేస్తే చాలు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు అనేది ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాదు ఇది జీవన శైలికి కూడా సంబంధించినదని తున్నారు. జీవితం నిలకడగా ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించడం మంచిదట. ఇంటి ప్రధాన ముఖ ద్వారం ఒక ముఖ్యమైన ప్రదేశం అని చెప్పాలి. ప్రతిరోజూ ఆ ద్వారాన్ని శుభ్రం చేస్తూ ఉండాలట. దీని వల్ల ఇంట్లోకి శుభ శక్తులు వస్తాయట. ముఖ్యంగా శుభ దినాల్లో రంగవల్లి వేయడం, దీపం పెట్టడం మంచి ఫలితాలిచ్చేలా చేస్తుందని చెబుతున్నారు. ద్వారం అశుభ్రంగా ఉంటే దోషాలు వస్తాయట.

అలాగే డబ్బు చేతిలో నిలవాలి అంటే చేయాల్సిన వాటిల్లో మరొక పని గోమాతకు రోటి తినిపించడం. హిందూమతంలో ఆవును గోమాతగా అంటే దేవతగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. గోవుల సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. ఆవుకు ప్రేమతో తినిపిస్తే అది ధనాన్ని ఆకర్షించేందుకు దారి తీస్తుందట. ఇది ధనసంబంధమైన అడ్డంకులను తొలగించగలదని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి గురువారం రోజు తులసి మొక్కకు పాలు నైవేద్యంగా సమర్పించాలట. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి పూజ చేసిన కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట. ఇది కుటుంబ శాంతిని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే వంట చేసేముందు పాన్ మీద కొన్ని పాలు చల్లడం వల్ల కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని, ఇంటికి మంచిని కలిగిస్తుంది. ఈ చిన్న పని చేయడం వల్ల డబ్బు సమస్యలు కూడా తగ్గుతాయట. పైన చెప్పిన విషయాలు తప్పకుండా పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలిగి ఇంట్లో అలాగే మన చేతిలో కూడా డబ్బులు మిగులుతాయని డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు అని చెబుతున్నారు.