Site icon HashtagU Telugu

Vastu Tips: అష్టైశ్వర్యాలు కలగాలి అంటే ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉండాల్సిందే?

Mixcollage 05 Feb 2024 10 38 Am 1656

Mixcollage 05 Feb 2024 10 38 Am 1656

మామూలుగా చాలామంది వాస్తు ప్రకారంగా ఇంటిని నిర్మించుకోవడంతోపాటు ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా వాస్తు ప్రకారంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారంగా కూడా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా సంపాదించింది వృధాగా ఖర్చు అయిపోతుందని, ఆర్థిక వృద్ధి కలగడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ఇంట్లో కలబంద మొక్కను పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంట్లో కలబంద మొక్కలు నాటుకుంటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే కీర్తికి, సంపదకు, ఆనందానికి లోటు ఉండదు. పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది. జీవితంలో శ్రేయస్సు ఆనందం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటవచ్చు. అంతేకాదు పశ్చిమదిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం పురోగతి కలుగుతుంది. కలబంద మొక్కను తూర్పు దిశలో నాటడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుంది. కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే రోగాలు దూరమవుతాయయి. అలాగే ధనధాన్యాలతో లోటు ఉండదు. కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను, ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో కలబంద మొక్క లను తెచ్చి సరైన దిశలో పెట్టండి. ఇంట్లో సానుకూలత కలిగించి, ప్రతికూలతలు తొలగించటం కోసం సాధ్యమైతే కలబంద మొక్కను తూర్పు, ఉత్తరం దిశలలోనే పెట్టండి. ఇది మీకు, మీ కుటుంబానికి శ్రేయస్సును, సంపదను తప్పకుండా తీసుకువస్తుంది.ఇది ఇంటికి కావాల్సిన పాజిటివ్ వైబ్ ను ఇస్తుంది.