మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. తెలిసి తెలియక చిన్నచిన్న పొరపాట్లే పెద్దపెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలను ఏరుకోరి మరి తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు పండితులు. స్నానం చేసిన తర్వాత ఎలాంటి చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్నానం చేసిన తరువాత, బకెట్ ఖాళీగా ఉంచవద్దు. కానీ వాస్తు ప్రకారం బకెట్‌లో స్వచ్ఛమైన నీటితో నింపాలి. మీరు నీటితో నింపకూడదు అనుకుంటే, బకెట్ ను తలక్రిందులుగా బోర్లించాలి. దీని వల్ల వాస్తు దోషం ఉండదు. అలాగే స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదట. మీ జుట్టు తడిగా ఉంటే, మేకప్ వేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తద్వారా నెగెటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమైన జుట్టులోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. పెళ్లి అయినా స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదట. ఇలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.
అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయట. అలాగే బాత్రూంలో ఎప్పుడూ తల్లి బట్టలు అలాగే వదిలిపెట్టకూడదు.
వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్థానం బలహీనపడుతుంది. కాబట్టి, స్నానం చేసిన తర్వాత తడి బట్టలు వదిలి వేయవద్దు. బదులుగా, స్నానం చేసే ముందు ఉతికేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత గోళ్లు కత్తిరించవద్దు. స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఒకవేళ మీరు గోర్లు కత్తిరించాలి అనుకుంటే స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవడం మంచిది.
కూరగాయలు కోయడం, గోళ్లు కత్తిరించడం వంటివి ఏ కారణం చేతనైనా మానుకోవాలి. లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయి. దీనితో పాటు మీరు డబ్బు నష్టాన్ని, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందట. అలాగే స్నానం చేసిన వెంటనే బాత్రూమ్ శుభ్రం చేయండి. లేకపోతే రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. అందుకే ఈ మూడు గ్రహాల దోషాలు వేగంగా పెరుగుతాయి. మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు కూడా దారి తీయవచ్చు అని చెబుతున్నారు.