Site icon HashtagU Telugu

Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి?

Vastu Tips

Vastu Tips

మామూలుగా చాలా మంది సూర్యోస్తమయం, సూర్యోదయం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే మన ఇంట్లోని పెద్దలు పండితులు సాయంత్రం ఉదయం సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి సూర్యాస్తమయం తరువాత కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదు అనుకున్నారు పండితులు. మరి ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాయంత్రం సమయంలో ఎప్పుడు కూడా తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించవచ్చు కానీ తులసి మొక్కను అస్సలు తాగకూడదు. అలాగే తులసి ఆకులను తెంపడం లాంటివి చేయడం వల్ల తులసి దేవుడికి కోపం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు. పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని నమ్ముతారు. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కలియుగంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు, పెరుగు, పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు.

ఇవన్నీ చంద్రుడికి ప్రతీకగా ఉంటాయి. అందుకే సంధ్యా వేళలో తెల్లని వస్తువులను ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే మీకు మనశ్శాంతి అనేది కరువవుతుంది. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఎవరికి అప్పులు ఇవ్వకండి. సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదే విధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు. సాయంకాలం సంధ్యా వేళలో హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి.