Site icon HashtagU Telugu

Vastu Tips: ఆర్థికనష్టాల నివారణ పొందాలంటే స్నానం చేసిన తర్వాత ఆ పనులు అస్సలు చేయకండి?

Mixcollage 08 Feb 2024 06 41 Pm 4151

Mixcollage 08 Feb 2024 06 41 Pm 4151

మామూలుగా మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా మానసికపరంగా ఇలా ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో స్నానం చేసిన తర్వాత చేసే పనులు కూడా ఒకటి. స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదట. ఇంతకీ ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం, కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించడం తప్పనిసరి. బాత్రూమ్ నుండి వచ్చే ప్రతికూలతలు నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాలి.

చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా బకెట్లో నీళ్లను వదిలి పెట్టకూడదు. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం ఎప్పుడు శుభ్రమైన నీటిని బకెట్లో నింపాలి. బకెట్ లో నీళ్ళు ఉంచనపుడు దానిని బోర్లించి పెట్టాలి. దీనివల్ల ఎటువంటి వాస్తుదోషం రాదు. వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు. జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోండి. స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి, ఈ విషయం గుర్తుంచుకోవాలి.

స్నానానికి ముందు నెయిల్ కట్టర్ ఉపయోగించకూడదు. అలాగే స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులు వాడకూడదు. స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకు, మంటల దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు. మొదట ఏదైనా తిన్న తర్వాత వంటగదిలోకి ప్రవేశించడం మంచిది. స్నానం చేసిన తర్వాత వెంటనే మేకప్ వెయ్యకూడదు. తడిబట్టలు ఉతకకుండా అలాగే అసలు ఉంచకూడదు. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ తడిగా, అపరిశుభ్రంగా ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. స్నానం చేసిన వెంటనే బాత్‌రూమ్‌ని శుభ్రం చేయకుంటే రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. దీని వల్ల ఈ మూడు గ్రహాల దుష్ఫలితాలు వేగంగా పెరుగుతాయి. అలాగే ఆర్థిక నష్టాల నుంచి నివారణ పొందాలంటే ఈ పనులు తప్పకుండా చేయాల్సిందే.