Vastu Tips: మనం తెలిసి చేసే ఈ పొరపాట్లే దరిద్రానికి హేతువులు అని మీకు తెలుసా?

మామూలుగా చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసీ తెలియక చేసే తప్పులే ఒక్కోసారి వాస్తు దోషాలకు కారణమవుతాయి. త

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 05:00 PM IST

మామూలుగా చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసీ తెలియక చేసే తప్పులే ఒక్కోసారి వాస్తు దోషాలకు కారణమవుతాయి. తెలిసీ తెలియక చేసే పొరపాట్లు మహా గ్రహపాట్లు గా మారి దరిద్రానికి హేతువులు అవుతాయి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని కచ్చితంగా ఆచరించవలసిన నియమాలు ఉన్నాయి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి లేని దరిద్రం వచ్చి పడుతుంది. మరి ఎలాంటి పొరపాటు చేయకూడదో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఎవరూ కూడా సూర్యోదయం అయ్యేవరకు నిద్రపోకూడదు.

చాలామందికి 8,9 గంటల వరకు పడుకునే అలవాటు ఉంటుంది. అలా అస్సలు పడుకోకూడదు. హెల్త్ బాగోలేని వారు పిల్లలు పడుకుంటే తప్పులేదు కానీ, మిగతావారు పడుకుంటే మాత్రం దరిద్రం తప్పదు. బాగా పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి వాకిలి చిమ్మ కూడదు. సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్టు, అప్పుడు ఇంటి ముందు నీళ్లు చల్లకూడదు. ఇక నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. దువ్వెనతో తల దువ్వ కూడదు. నిద్ర లేవగానే పడుకున్న దుప్పట్లు మడత పెట్టి బెడ్ శుభ్రంగా సర్దాలి. లేదంటే దరిద్ర దేవత అక్కడ తిష్టవేసి కూర్చుంటుంది. ఇక ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు.

వంట గదిలో వాడే మసి బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. మాసిన బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్ళను కాళ్లపైన పోసుకోకూడదు. అలా చేస్తే దరిద్ర దేవత నేరుగా మనతో పాటు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టుకుని చాలాసేపు కూర్చోకూడదు. అన్నం తిన్న తర్వాత ఎంగిలి చేయి కడుక్కొని మళ్లీ అదే కంచం ముందు కూర్చోకూడదు. అలా చేస్తే రోగ పీడితులు అవుతారు. సాయంత్రం భార్యాభర్తలు శృంగారం చేయకూడదు. నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయాన్ని ప్రదోషకాలంగా గుర్తించి ధ్యానం, పూజ వంటివి చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు కాబట్టి వాటిని సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే ఇంటికి తెచ్చుకుంటే శనిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి పైన చెప్పిన విషయాలను తెలిసి తెలియకుండా కూడా అసలు చేయకూడదు. అలా చేశారంటే మీరు లేనిపోని కష్టాలను ఏరుకోరిమరి తెచ్చుకున్నట్టే.