Site icon HashtagU Telugu

Vasthu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే చాలు.. ఆర్థిక సమస్యలు దూరం అవ్వాల్సిందే!

Mixcollage 15 Mar 2024 07 47 Pm 5051

Mixcollage 15 Mar 2024 07 47 Pm 5051

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. కష్టపడి సంపాదించినప్పటికీ సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. దీంతో ఈ అప్పుల బాధలు పెరిగిపోయి కంటి నిండా కునుకు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇలా ఈ సమస్యల నుంచి బయట పడాలి అంటే వాస్తు విషయాలను తప్పకుండా పాటించాల్సిందే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

పడుకునే ముందు బెడ్రూంలో గంధపు పరిమళాలు వెదజల్లేలా, గది మొత్తం గంధపు నీళ్లను, పన్నీటిని వెదజల్లండి. ఇది సహజ సిద్ధంగా రాహు దోషాన్ని తొలగించి మీకు నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండి పెద్దలు కానీ పిల్లలు కానీ నిద్ర పోకుండా ఇబ్బంది పడుతుంటే దిండు కింద కొన్ని బార్లీ గింజలను ఉంచి పడుకోండి. ఉదయం లేచిన తర్వాత ఆ గింజలను పక్షులకు కానీ పావురాలకు కానీ తినిపించండి. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తికి ఉన్న నిద్రలేమి సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. దీంతో పాటు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. జీవితంలో ఏ రంగంలోనైనా వారికి లబ్ధి చేకూరుతుంది.

ఇక పడుకునే గదిలో మంచం కింద దుమ్ము ధూళి, చెప్పులు, బూట్లు, ఏవైనా పనిచేయని ఎలక్ట్రిక్ వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే వారికి శాశ్వత నిద్రలేమి సమస్యలు కలుగుతాయి. ఆ పరిస్థితి రాకుండా మంచం కింద ఏమీ లేకుండా జాగ్రత్త పడండి. బెడ్ షీట్లు, దిండు కవర్ల విషయంలో ఈ పని చెయ్యండి ఇక మంచి నిద్ర కోసం ఎప్పుడు బెడ్ షీట్లను శుభ్రంగా ఉంచుకోండి. ఉదకని బెడ్ షీట్లను ఎక్కువ కాలం పాటు వాడకండి. బెడ్ షీట్లు దిండు కవర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉతికి, మళ్లీ బెడ్ పైన వేసుకోవాలి. అలా చేస్తే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

అలా కాకుండా మురికిగా ఉన్న బెడ్ షీట్ల మీద పడుకుంటే, అది ప్రతికూలతను తీసుకువస్తుంది. మనిషి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది కాబట్టి బెడ్ షీట్లను, దిండు కవర్లను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. బెడ్ క్రింద ఇలా ఉంటేనే సుఖవంతమైన నిద్ర ఇక ప్రస్తుతం చాలా ఇళ్లల్లో బాక్స్ బెడ్లు వినియోగిస్తున్నారు. ఇక ఈ బాక్స్ బెడ్ లలో బెడ్ కింద ఎక్కడెక్కడి పాత సామాన్లను, పాత బట్టలను, రకరకాల వస్తువులను పెడుతున్నారు. అయితే ఇది కూడా నిద్రలేమికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు ఎప్పుడూ చెబుతున్నారు. కాబట్టి నిద్రపోయే మంచం కింద, ఎటువంటి వస్తువులు ఉండకూడదు.