Site icon HashtagU Telugu

Vasthu Tips: దీపాన్ని నూనెతో వెలిగించాలా లేకపోతే నెయ్యితో వెలిగించాలా?

Vasthu Tips

Vasthu Tips

మామూలుగా భారతదేశంలో హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొందరు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందని లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి నట్లే అని పండితులు కూడా చెబుతూ ఉంటారు. అయితే దీపారాధన చేస్తూ ఉంటారు కానీ ఈ దీపారాధన విషయంలో అనేక రకాల సందేహాలు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. నిత్య దీపారాధన మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఆనందం, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

దురదృష్టం లేదా వాస్తు దోషాన్ని అంతం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపం వెలిగించడం అనేది అన్ని మతపరమైన ఆచారాలలో, దేవతా పూజలలో అంతర్భాగం. చాలామంది ఉన్న సందేహం ఏమిటంటే దీపం వెలిగించేటప్పుడు అందులో నూనె వేయాలా లేదంటే నెయ్యి వెయ్యాలా. నూనెతో దీపం వెలిగించాలా లేకపోతే నీతో దీపం వెలిగించాలా అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం నెయ్యి , నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు. కానీ అవి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి.

మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఏవైనా నెరవేరని కోరికలు ఉంటే, మీరు నూనె దీపాన్ని వెలిగించాలి. మరోవైపు భగవంతుని పూజలో ఎప్పుడూ నెయ్యి దీపాన్ని ఉపయోగించాలి. ఈ రెండు దీపాలు వెలిగించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి లేదా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. హనుమంతునికి భక్తిని తెలియజేయడానికి, మీరు మల్లె నూనెతో మూడు మూలల దీపాన్ని వెలిగించవచ్చు. మంగళవారం శనివారం ఇలా చేయాలి. మరోవైపు, సూర్య భగవానుడు, కాల భైరవుడిని శాంతింపజేయడానికి ఆవనూనె దీపాన్ని వెలిగించడం మంచిది. ఒక వ్యక్తి జాతకంలో రాహువు, కేతువు అననుకూల స్థానాలు ఉంటే, వారి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి నూనె దీపం వెలిగించడం ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.