Site icon HashtagU Telugu

Friday: శుక్రవారం రోజు లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలంటే.. తప్పకుండా ఈ నియమాలను తెలుసుకోవాల్సిందే?

Mixcollage 20 Feb 2024 09 38 Pm 5714

Mixcollage 20 Feb 2024 09 38 Pm 5714

హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. పరిస్థితులు కూడా మారవు. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సిందే. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతోపాటు శుక్ర గ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇది కెరీర్, వ్యాపారం, ప్రేమ సంబంధాలలో విజయాన్నిస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు.

అందుకే చాలామంది ఇంట్లో సంతోషం, శ్రేయస్సు మరియు సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు. అయితే లక్ష్మీదేవి కొంతమంది ఇళ్లలోనే నివసిస్తుంది. అటువంటివారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని పనులు చేస్తారని చెబుతున్నారు. అసలు లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలి వంటి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.. కష్టపడి పని చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెబుతారు. కష్టపడి ఆహారాన్ని పొదుపు చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బద్దకాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది.

అటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది. శుక్రవారం నాడు మీరు లక్ష్మీ దేవికి ఎన్ని పూజలు చేసినా కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఒకవేళ లక్ష్మీదేవి వచ్చిన ఇంట్లో నెగిటివ్ రిజల్ట్స్ కనపడితే వెంటనే వెళ్ళిపోతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఎప్పుడూ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులందరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉండాలి.