Vasthu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. వెంటనే తొలగించకపోతే కష్టాలు తప్పవు?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇల్లు, మొక్కలు, వస్తువుల అమరికలు ఇలా ప్

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 08:00 PM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇల్లు, మొక్కలు, వస్తువుల అమరికలు ఇలా ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూనే ఉన్నారు. అయితే మనం ఎదుర్కొనే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలకు ఒకరకంగా వాస్తు దోషాలు కూడా కారణం అవ్వవచ్చు. కాబట్టి వాస్తు విషయాలను పాటించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక బలం చేకూరుతుంది. మాములుగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.

ఇంట్లో ఎక్కువ కాలం పాటు కదల్చకుండా వాడకుండా అలాగే పెట్టిన వస్తువులలో రాహు, కేతువులు, శని నివాసం ఉంటారట. దానివల్ల ఇంట్లోని సభ్యులు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంట్లో ఉపయోగించని పాత ఇనుప వస్తువులు లేదా పనిముట్లు పెట్టుకోకూడదు. వాడని వస్తువులు నెమ్మదిగా తుప్పు పడుతుంటాయి. ఇలా తుప్పు పట్టిన పనిముట్లను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందులు తప్పవు. వాస్తు ప్రకారం తుప్పు పట్టిన పనిముట్లు, ఇనుప వస్తువులు చాలా నెగెటివ్ ఎనర్జీని పోగు చేస్తాయి.

అలాంటి వస్తువులు ఇంట్లో కనిపిస్తే వెంటనే తొలగించడం మంచిది. అలాగే ఇంట్లో ఆగిపోయిన గడియారాలు అసలు ఉంచకూడదు. గోడమీద పనిచెయ్యని గడియారాలు ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభం. అయితే పని చేయని గడియారాన్ని గోడమీద నుంచి తీసి ఏదో ఒక మూలన పడేస్తారు. పనిచేయని గడియారాన్ని అసలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా పనిచేయని గడియారాల వల్ల ఇంట్లో నివసించే వారికి చెడు సమయానికి కారణమవుతాయి. కాలం కలిసి రావడంలేదు అనే మాట తరచుగా వింటుంటాము. ఇలా కాలం కలిసి రాకపోవడానికి ఇంట్లో పనికిరాని గడియారాలు ఉండడం కూడా ఒక కారణం.

చాలా మంది ఇత్తడి పాత్రలు స్టోర్ రూమ్ లలో దాచి ఉంచుతారు. వాడని ఇత్తడి పాత్రల్లో తుప్పు చేరుతుంది. ఇత్తడి పాత్రలు చీకట్లో పెట్టడం వల్ల అందులో శని చేరుతుందట. శని దోషాల వల్ల జీవితంలో చాలా కష్టాల పాలు కావాల్సి ఉంటుంది. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరమైన అనేక రకాల కష్టాలు శనిప్రభావంతో రావచ్చు. కనుక వాడని ఇత్తడి సామను ఇంట్లో పెట్టుకోకూడదు. లేదంటే వాటిని తరచుగా శుభ్రం చేసి పెట్టుకోవాలి.