Vastu Tips: పొరపాటున కూడా మెట్ల కింద ఈ వస్తువులను అస్సలు పెట్టకండి.. అవేంటంటే?

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటాం. చాలామంది వాస్తు విషయాలను పాటించినప్పటికీ తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొర

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 02:30 PM IST

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటాం. చాలామంది వాస్తు విషయాలను పాటించినప్పటికీ తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ఇంట్లో మెట్ల కింద కొన్ని రకాల వస్తువులను పెట్టడం కూడా ఒకటి. ఇంట్లో మెట్ల నిర్మాణం సరైన దిశలో చేయడమే కాకుండా, మెట్ల కింద పెట్టే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. లేదంటే దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది. మరి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అన్న విషయానికి వస్తే.. చాలామంది మెట్లకింద ఖాళీగా ఉందని అక్కడ ఇంట్లో ఉపయోగించిన అనేక వస్తువులను పెడుతూ ఉంటారు.

మెట్ల కింద ఏమి పెట్టొచ్చు ఏమి పెట్టకూడదు అనే సరైన జ్ఞానం లేకపోవడం వల్ల మెట్ల కింద స్థలాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల దోషాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి చిన్న, పెద్ద వస్తువు ఆ ఇంట్లోని వ్యక్తుల ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులపై శుభ లేదా అశుభ పరిణామాలను కలిగిస్తూ ఉంటాయి. చాలామంది ఇంట్లో స్థలం లేదని మెట్ల కింద వస్తువులను పెడుతూ ఉంటారు. మెట్లు తూర్పు దిశలో నిర్మించిన, మెట్ల కింద చెత్తా చెదారం జమ చేసినా ఆర్థిక నష్టంతో పాటుగా కుటుంబం కలహాలు పెరుగుతాయి. ఇకపోతే మెట్లకింద చేయకూడని కొన్ని పనుల విషయానికి వస్తే. పొరపాటున కూడా మెట్లకింద టాయిలెట్ నిర్మించకూడదు. స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేయకూడదు. మెట్ల నిర్మాణం ఎప్పుడు దక్షిణ దిశ వైపు లేదా పశ్చిమ దిశ వైపు ఉండాలి.

పొరపాటున కూడా ఉత్తరం, తూర్పు దిశ వైపు ఉండకూడదు. ఉత్తరం, తూర్పు దిశలో నిర్మించిన మెట్లు ఆర్థిక నష్టం కలిగిస్తాయి. మెట్లకింద బూట్లు, చెప్పులు, ఇనుప వస్తువులు పెట్టకూడదు. మెట్ల కింద చెత్త బుట్టలను పెట్టకూడదు. పగిలిపోయిన ఫ్యామిలీ ఫోటోలు, లేదా ఇంట్లో పాడైపోయిన వస్తువులు వంటివి మెట్ల కింద పెట్టకూడదు. ఇవన్నీ వాస్తుదోషాలుగా మారి కుటుంబంలో ఉద్రిక్తతకు కారణమవుతాయి. ఆర్థిక కష్టాలను, అనవసరమైన కష్టాలను కలిగిస్తాయి. దరిద్రదేవతకు ఆహ్వానం పలుకుతాయి. కాబట్టి ఇకమీదట మెట్ల కింద ఇలాంటి వస్తువులను అసలు పెట్టకండి..

Follow us