హిందూగ్రంథాలలో తులసి తర్వాత..అరటి చెట్టును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ అరటి మొక్క బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుభకార్యాల్లో అరటిచెట్టుకున ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పసుపు దారంతో కట్టిన అరటివేరును ధరించడం వల్ల బృహస్పతి బలపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇంట్లో ఏ దిక్కున అరటి చెట్టును నాటితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.
ఇంట్లో అరటి చెట్టును నాటడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రోగాల నుంచి రక్షిస్తుంది. వాస్తు ప్రకారం మీరు అరటి చెట్టును నాటాలనుకున్నట్లయితే…తూర్పు లేదా దక్షిణ దిక్కుల అగ్నికోణంలో అంటే తోట మధ్యలో నాటకూడదని గుర్తుంచుకోండి. పశ్చిమదిశలో అరటి చెట్టును నాటడం మంచిదని వాస్తు శాస్త్రం పేర్కొంది.
అరటి చెట్టును పూజించినట్లయితే ఆర్థికంగా బాగుంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లి జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. గురువారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు దస్తులు ధరించాలి. అరటి మొక్కలో నీరు పోసి చుట్టు 9సార్లు ప్రదక్షిణలు చేయండి. అరటి మొక్క ముందు బెల్లం , శనగలు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత అరటి మొక్క ముందు కూర్చుండి బృహస్పతి లేదా శ్రీ హరి విష్ణు మంత్రాలను జపించండి. పూజ తర్వాత ప్రసాదాన్ని ఇతరులకు పంచండి. అరటిపండును దానం చేసిన రోజు మీరు అరటిపండును తినకండి. సూర్యోదయం సమయంలో అరటి పండును తినండి.