Vastu Tips: దక్షిణ దిశలో ఈ వస్తువులు ఉంచితే చాలు.. లక్ష్మీదేవి తలుపు తట్టడం ఖాయం?

వాస్తు ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టకపోతే, వాస్తు నియమాలు పాటించకపోతే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మన ఇంట్లో పెట

  • Written By:
  • Updated On - February 14, 2024 / 09:04 PM IST

వాస్తు ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టకపోతే, వాస్తు నియమాలు పాటించకపోతే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మన ఇంట్లో పెట్టుకునే వస్తువులు,డెకరేషన్ వస్తువులను ఏవైనా సరే వాస్తు నియమాలను అనుసరించడం అన్నది తప్పనిసరి. ముఖ్యంగా దక్షిణ దిశలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఆర్థికంగా లాభం చేకూరుతుంది. దక్షిణ దిశలో పెట్టే కొన్ని వస్తువులు మీ ఇంటికి శుభాలను చేకూరుస్తాయి. దక్షిణ దిశలో యముడు దిశగాను,పూర్వీకుల దిశగాను పరిగణిస్తారు. ఈ దిశలో చీపురును ఉండటంవల్ల మంచి జరుగుతుందని చెబుతారు.

అయితే చీపురును ఊడ్చే భాగం కింది వైపు, చేతితో పట్టుకునే భాగంపై వైపు ఉండేలా పెట్టుకోవాలి. దీని వల్ల ఆర్థికంగా ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా హాల్లో, లేదా డ్రాయింగ్ రూమ్ లో దక్షిణ దిశలో జేడ్ మొక్కను పెట్టుకోవడం మంచిది. ఈ మొక్క వల్ల కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకు డబ్బులు వస్తాయి. అలాగే ఇది ఇంటి శ్రేయస్సుకు చిహ్నం. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచడం వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఫినిక్స్ పక్షి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి.

ఇంట్లో దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రించడం మంచిదని, అలా చేయడం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక దక్షిణం వైపు భారీ వస్తువులను పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. ఇంట్లో విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని దక్షిణం వైపు పెట్టాలని అప్పుడు ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి పైన చెప్పిన విధంగా వాస్తు ప్రకారం ఇంట్లో దక్షిణ దిశలో ఆ విధంగా వస్తువులు ఉంచితే చాలు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కాయం.