Site icon HashtagU Telugu

Vasthu Tips: చిలుకలను ఇంట్లో పెంచుకోవచ్చా.. ఈ దిశలో ఉండడం తప్పనిసరి!

Mixcollage 04 Mar 2024 10 16 Pm 5085

Mixcollage 04 Mar 2024 10 16 Pm 5085

మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల పక్షులు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో చిలుకలు కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల చిలుకలకు మాట్లాడడం లాంటివి కూడా నేర్పిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిలుకలు ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంట్లో సానుకూలత వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఇక చిలుకలను ఇంట్లో పెంచకూడదు అనుకుంటే, చిలుకల చిత్రాలను ఇంట్లో పెట్టుకున్నప్పటికీ అవి మీ అదృష్టాన్ని మార్చేవిగా ఉంటాయట. చిలుకల చిత్రాలు పెడితే సరైన వాస్తు దిశలోనే పెట్టాలి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సామరస్య ధోరణి, కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు కొనసాగాలంటే చిలుకల చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలని సూచించబడింది.

అయితే చిలకల చిత్రాలను పెట్టేటప్పుడు సరైన వాసు దిశలోనే పెట్టాలని చెప్పబడింది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, వాటి నుండి బయటపడడం కోసం చిలుకల చిత్రాలను ఉంచుట మంచిదని చెప్పబడింది. చిలుకలు ఇంట్లో ఉన్న సమస్యలను దూరం చేయడంలోనూ, నెగిటివ్ ఎనర్జీ ని పోగొట్టడంలోని ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దిశలో పెంచుకుంటే అదృష్టం అయితే ఇంట్లో చిలకల చిత్రాలను పెట్టే విషయంలో ఉత్తర దిశలోనే చిలుకల చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల స్టడీస్ రూమ్స్ లో ఉత్తర దిశలో చిలకల చిత్రాలను పెట్టినట్లయితే పిల్లలు విద్యలో రాణిస్తారు. ఇక ఇంటికి ఈశాన్య దిశలో చిలుకను పెంచుకోవడం వల్ల ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది చాలా శుభప్రదంగా సూచించబడింది.

దీంతో ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. ఇక చిలుకలను ఇంట్లో పెంచుకునేవారు వాటికి స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించాలి. వైవాహిక జీవితంలో ఆటంకాలు తొలగిపోవాలంటే చిలుకల జంట ఇక వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏవైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోవడానికి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి చిలుకల జంట చిత్రాలను బెడ్ రూమ్ లో పెట్టడం మంచిదని సూచించబడింది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగి ప్రేమ మరింత బలపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పచ్చని రంగుతో కిలకిల రావాలతో సందడి చేసే చిలుక మనకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా వాస్తు పరంగానూ చాలా మేలు చేకూరుస్తుంది. ఇంట్లో చిలుకలు పంచితే ఈ దోషాల నుండి విముక్తి చిలుకల చిత్రాలు కానీ, చిలుకల బొమ్మలు కానీ ఇంట్లో పెట్టుకుంటే రాహువు, కేతువు, శని దోషాల నుండి, చెడు దృష్టి నుండి కొంతమేర ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఎవరికీ అకాల మరణం సంభవించదని సూచిస్తున్నారు. ఇంటికి ఇన్ని శుభాలు చేకూర్చే చిలుకలను పెంచుకున్నా, చిలుకల చిత్రాలను పెట్టుకున్నా అంతా మంచే జరుగుతుంది. మరెందుకాలస్యం చిలుకలను పెంచుకోవటానికి రెడీ అయిపోండి.