Vastu Tips: గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

మామూలుగా మన వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. కొందరు ఇంట్లో పూల కోసం గన్నేరు మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు

  • Written By:
  • Updated On - February 14, 2024 / 11:04 PM IST

మామూలుగా మన వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. కొందరు ఇంట్లో పూల కోసం గన్నేరు మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. మరి గన్నేరు మొక్కలను పెంచుకోవడం మంచిదేనా? గన్నేరు మొక్కలను పెంచుకుంటే దురదృష్టం వస్తుందా? ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం గన్నేరు పువ్వు చాలా పవిత్రమైనది.గన్నేరు పువ్వులు తెలుపు, గులాబీ, పసుపు, లేత గులాబీ రంగులలో ఉంటాయి. ఇంట్లో భార్యా భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే, అటువంటి ఇంట్లో గన్నేరు మొక్కలు పెడితే, ఆ మొక్కలు పూలు పూస్తే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయని చెబుతున్నారు.

గన్నేరు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి, గన్నేరు పూలు లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఇంట్లో గన్నేరు మొక్కలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. లక్ష్మీ దేవికి తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు శ్రీ మహా విష్ణువుకు కూడా పసుపుపచ్చని గన్నేరు పువ్వులు అంటే ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని పసుపుపచ్చని గన్నేరు పూలతో పూజించినట్లయితే సంపద వృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. సంపద, శ్రేయస్సు వృద్ధి జరుగుతుంది.

తెల్లటి రంగు గన్నేరు మొక్కను తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పసుపు రంగు పూల గన్నేరు మొక్క ఇంటికి ప్రధాన ద్వారం ముందు తూర్పు భాగంలో పెట్టుకోవడం మంచిది. గన్నేరు పువ్వు లను వేద జ్యోతిషశాస్త్రంలో మంగళ దోష నివారణకు ఉపయోగిస్తారు. కనుక గన్నేరు పూల వాస్తు ప్రయోజనాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే, గన్నేరు పూలు నిత్యం పూజలో వాడితే అదృష్టానికి తలుపులు తీసినట్టే.