Vastu Tips: రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం గా ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో వస్తువుల అమర్చడం వరకు ప్రతి ఒక విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఇక వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంట్లో ఉండే చీపురు విషయంలో కూడా కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. వాస్తు శాస్త్ర ప్రకారం గా చీపురు ఏ దిశలో ఉండాలి. రాత్రి సమయంలో చీపురుతో ఇల్లును ఊడ్చవచ్చా లేదా ఇటువంటి సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా చీపురు అనేది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది. చీపురులేని ఇల్లంటూ ఉండదు. అయితే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి అంటే క్రమం తప్పకుండా ఇంటిని చీపురుతో శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక ప్రతిరోజు మహిళలు ఉదయం,సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో సూర్యస్తమయం సమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న బిజీ బిజీ షెడ్యూల్ వల్ల ఉద్యోగానికి వెళ్లి వచ్చిన తర్వాత మహిళలు సాయంత్రం సమయంలో రాత్రి పూట ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటిని శుభ్రం చేసేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి.
రాత్రి సమయంలో ఇంట్లో చీపురుతో ఊడిస్తే అశుభం కలుగుతుంది. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఒకరోజులో ఎన్నిసార్లు ఊడ్చవచ్చు అన్న విషయానికి వస్తే నాలుగుసార్లు సరైన సంఖ్య అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. సాయంత్రం పూట ఇల్లును చిపురితో శుభ్రం చేయడం మంచిదికాదని సూచిస్తుంది. అలాగే చీపురును సరైన దిశలో ఉంచడం కూడా మంచిది. చీపురు ఇంటికి పశ్చిమ దిశలో ఉంచాలని తెలిపింది. అలా ఉంచితే లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని ఖర్చులు తగ్గుతాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇతర దిశల్లో చీపురు ఉంచడం వల్ల నష్టాలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.