Site icon HashtagU Telugu

vastu tips: ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కడం లేదా.. అయితే ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి?

Mixcollage 31 Jan 2024 09 34 Am 1328

Mixcollage 31 Jan 2024 09 34 Am 1328

మామూలుగా చాలా మంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల ఆచార వ్యవహారాలు పద్ధతులు అలాగే కొన్ని రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసినప్పటికీ పూజ చేసిన ఫలితం దక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం దక్కడం లేదు అంటే మీరు చేస్తున్న పూజల్లో ఏదో తప్పులు లోపాలు ఉన్నట్టు గుర్తించాలి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు మనకు పూజల ఫలితం రాకుండా చేస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో, పూజ మందిరంలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు.

పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి. పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పూజగదిని పొరపాటున కూడా దుమ్ముగా ఉంచకూడదు. శుభ సమయంలోనే పూజలు క్రమం తప్పకుండా చేయాలి. ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించదు. ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు. పూజ చేసి, ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో పూజించే దేవత మూర్తుల విగ్రహాలను, ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

దుర్గాదేవి విగ్రహం, శని విగ్రహం, ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం అస్సలు మంచిది కాదు. దేవుడికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు. పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడపడితే అక్కడ పడేయ కూడదు. పగిలిపోయిన దేవుని పటాలను వాడకూడదు. ఎత్తయిన విగ్రహాలను పూజలో ఉపయోగించ కూడదు. ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకుని పాటిస్తే పూజా చేసిన ఫలితం దక్కుతుంది.

Exit mobile version