Vastu Tips: వంటింటి నుంచి ఈ 4 వస్తువులను ఎవరికైనా ఇచ్చారో.. బతుకు బస్టాండే!!

వంటిల్లు అనేది లక్ష్మీ కటాక్షానికి పెన్నిధి. దాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అందులోని 4 ఆహార వస్తువులను మాత్రం ఇచ్చి పుచ్చుకునే విషయంలో అత్యంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 06:40 AM IST

వంటిల్లు అనేది లక్ష్మీ కటాక్షానికి పెన్నిధి. దాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అందులోని 4 ఆహార వస్తువులను మాత్రం ఇచ్చి పుచ్చుకునే విషయంలో అత్యంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపడి వాటిని ఇతరులకు దానం చేస్తే..మీ ఇంట్లో ఉండాల్సిన లక్ష్మీ కళ కాస్త గాడి తప్పే ముప్పు ఉంటుంది.. ఆ నాలుగు వస్తువుల గురించి ఇపుడు తెలుసుకుందాం..

పసుపు..

యాంటీ అలర్జీక్ లక్షణాలు పసుపు లో కోకొల్లలుగా ఉంటాయి. అందుకే మన వంటకాల్లో దాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే.. పసుపు కు బృహస్పతి గ్రహంతో సంబంధం ఉంటుంది. వంట ఇంట్లో పసుపు స్టాక్ అయిపోవడాన్ని గురు దోషంగా చెబుతారు. గురు దోషం వల్ల ఇంట్లో ధనం తగ్గిపోతూ ఉంటుంది. కెరీర్ లో వైఫల్యాలు ఎదురవుతాయి. వంట ఇంటికి అవసరమైన పసుపును ఎవరి నుంచి ఉద్దెర అడిగి తెచ్చుకోకూడదు. ఎవరైనా అడిగినా ఇవ్వకూడదు.

బియ్యం..

బియ్యం యొక్క సంబంధం శుక్ర గ్రహంతో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు కారకుడిగా పరిగణిస్తారు.ఇంట్లో బియ్యం అయిపోతే దాన్ని శుక్రదోషంగా చెబుతారు. దీనివల్ల భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అందుకే వంట ఇంట్లో బియ్యం స్టాక్ అయిపోకుండా ముందు జాగ్రత్త పడాలి. అవసరానికి మించి బియ్యం ఉన్న సమయంలోనే దాన్ని దానం చేయడం గురించి ఆలోచించాలి.

ఉప్పు..

వంట ఇంట్లో ఉప్పు స్టాక్ అయిపోకుండా ప్లాన్ చేసుకోవాలి. ఉప్పు డబ్బాను ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉప్పు అనేది రాహు గ్రహ పదార్థం. ఉప్పు స్టాక్ అయిపోగానే రాహు గ్రహం మీ ఇంటి వైపు చూస్తుంది. ఫలితంగా మీ జీవితం కష్టాల్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారిగా కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టే ముప్పు ఉంటుంది. ఉప్పును దానం చేయకూడదు. దానం తీసుకోకూడదు.

ఆవాల నూనె..

ఇంట్లో మనం వాడే ఆవాల నూనెకు శనిగ్రహం తో సంబంధం ఉంటుంది. ఆవాల నూనె కూడా పూర్తిగా అయిపోకుండా మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఆవాల నూనె అయిపోతే.. మీరు శని గ్రహ ప్రకోపానికి గురి అవుతారు. అందుకే దీని స్టాక్ అయిపోకముందే నింపుకుంటూ ఉండండి. మంగళవారం, శనివారం రోజున ఆవాల నూనెను కొని ఇంటికి తీసుకు రాకండి. ఈ రెండు రోజుల్లో దీన్ని ఎవరికీ దానం కూడా ఇవ్వొద్దు.