Neem Tree: వేప చెట్టు ఇంటిముందు తూర్పున ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

  • Written By:
  • Updated On - March 5, 2024 / 01:58 PM IST

మామూలుగా చాలా మంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి చుట్టూ ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. కొందరు వేప చెట్టుని నాటి పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి వేప చెట్టు ఇంటి ముందు ఉండవచ్చా. అలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది. వాస్తు ప్రకారం వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిదా ? కదా? ఎందుకు? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతూ ఉంటారు.

వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెబుతారు. అందుకు కారణం లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని పేర్లు ఇంటి గోడలలోకి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్లను పెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు. ఆ దిశలలోనే వేపచెట్టు పెంచితే మంచిది అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు.

దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయట. చాలామంది ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టేయాలని చాలామంది చెబుతూ ఉంటారు. తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది? పరిహారం ఏమిటి? అయితే తూర్పు దిశలో కాంపౌండ్ వాల్ బయట ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం లేదు. తూర్పు దిశలో వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగి పోవాలంటే కూడా ఒక చక్కని రెమిడి ఉంది. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి, పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందట. వేపచెట్టు దేవతా స్వరూపం నీళ్ళు పోసి పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. దుర్గామాత వేపచెట్టు లో నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి, దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా దానిని పూజించాలి.