Site icon HashtagU Telugu

Coconut: ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నారా… అయితే కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Samayam Telugu 60995284

Samayam Telugu 60995284

మామూలుగా చాలామంది ఈ వాస్తు దోషాలు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు కారణంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు వాస్తు విషయాలను పాటించడంతో పాటు కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కొబ్బరి కాయలతో చేసే కొన్ని వాస్తు పరిహారాలు మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి, సమస్యల నుండి గట్టెక్కిస్తాయి. హిందువులు కొబ్బరికాయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

మన ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరగాలన్నా కొబ్బరికాయలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇంట్లో నిర్వహించే పూజలలో కలశాలలో పెట్టడానికి కొబ్బరి కాయలను వాడతారు. సంపదల దేవతయైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరి కాయలు మీ చుట్టూ, ఇంటి చుట్టు తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేస్తే, మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది.

అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలి అనుకునేవారు శుక్రవారంనాడు లక్ష్మీదేవికి తామర పువ్వులను, తెల్లటి వస్త్రాలను, పెరుగు, తెల్లని స్వీట్లను సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలి. ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి ఇంట్లో డబ్బులను పెట్టే చోట భద్రంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి, ఆంజనేయస్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి. కచ్చితంగా ఏడు వారాల పాటు ఈ నియమాన్ని పాటిస్తే, ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు.