Site icon HashtagU Telugu

Kitchen: డబ్బు సమస్యలతో సత్యమతమవుతున్నారా.. అయితే వంటగదిలో వీటిని అస్సలు బోర్లపెట్టకండి?

Mixcollage 06 Feb 2024 01 38 Pm 3378

Mixcollage 06 Feb 2024 01 38 Pm 3378

మామూలుగా చాలామందిని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంత కష్టపడే డబ్బు సంపాదించినప్పటికీ ఏదో ఒక విధంగా ఆర్థిక సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులే ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు. అటువంటి వాటిలో వంట గదిలో వాటిని బోర్ల పెట్టడం కూడా ఒకటి. మరి వంట గదిలో ఎటువంటి వాటిని బోర్ల పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంట గదికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో సమస్యలకు, ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని కష్టాలకు వంటగది వాస్తు దోషాలు కూడా ఒక్కోసారి కారణంగా మారుతాయి.

వంట గదిలో అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది. అందుకే కిచెన్లో పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉంచుకోకూడదు. కొన్ని వస్తువులను బోర్లా పెట్టకూడదు. కిచెన్లో చీపుర్లు పెట్టకూడదు. చీపురును లక్ష్మీదేవి సంకేతంగా చెబుతారు. అటువంటి చీపురును వంట గదిలో పొరపాటున కూడా ఉంచకూడదని, ఒకవేళ చీపురు వంటగదిలో ఉంటే చిరాకులు తప్పవని చెబుతున్నారు చీపురు వంటగదిలో ఉండటంవల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవుతుంది. అన్నపూర్ణ దేవికి కూడా ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది విరిగి పోయిన గిన్నెలు, ప్లేట్లను ఇళ్లలోనే పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

ఇలా విరిగి పోయిన గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు ఇంట్లో ఉంచుకోవడం వల్ల చిరాకులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉపయోగించే బాణలిని కాని, దోశ పెనం కానీ పొరపాటున కూడా బోర్లా పెట్టకూడదు. ఇలా బోర్లా పెడితే ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్లో అద్దం ఉండకూడదు. ఎవరైనా కిచెన్లో అద్దం పెట్టుకుంటే అగ్నిదేవుడు ఎనర్జీ రెట్టింపవుతుంది.