Vasthu Tips: తాళాలు,తాళం చెవి పెట్టేటప్పుడు ఈ విషయాలు పాటించడం తప్పనిసరి?

  • Written By:
  • Updated On - March 7, 2024 / 06:10 PM IST

మనం ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో మొక్కల విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళం చెవులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తూ ఉంటారు. ఇంట్లో తాళాలను, తాళం చెవులను సరైన దిశలో పెడితే మీ ఇంటికి అదృష్ట తాళాలు తెరవబడతాయట. మామూలుగా చాలామంది ఇంట్లో తాళం నీ తాళం చెవిని ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

ఇళ్లల్లో తాళాలు, తాళం చెవులే కదా అని ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. తాళాలు, తాళం చెవులను కచ్చితంగా ఇంట్లో నిర్దిష్టమైన ప్రాంతంలోనే పెట్టాలని, ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళంచెవుల విషయంలోఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో మనం తాళం చెవులను, తాళాలను పెట్టేటప్పుడు హాల్లో పెట్టకూడదు. ఇంట్లోకి బయట నుండి వచ్చే కొత్తవారు ఇంట్లోని తాళాలను, తాళం చెవులను చూడడం మంచిది కాదు.

దీనివల్ల జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయని, అందుకే పొరపాటున కూడా హాల్లో తాళాలను, తాళం చెవులను ఉంచకూడదు. తాళాలు అక్కడ పెడితే ప్రతికూల ఫలితాలు చాలామంది ఇంట్లో ఆగ్నేయంలో తాళం చెవులను పెడుతూ ఉంటారు, వంటగది సమీపంలో పూజా స్థలం దగ్గర తాళం చెవులను పెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మనం తాళం చెవులను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటాం కాబట్టి వంటగదికి, పూజ స్థలానికి దగ్గరగా పెట్టడం మంచిది కాదు. ఇక తాళం చెవులను పెట్టేదిశ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పశ్చిమ దిశలో తాళం చెవులను పెట్టడం మంచిది. ఒకవేళ ఏదైనా ఆస్తిని విక్రయించుకోవాలని మీరు భావించినప్పుడు, ఆ ఆస్తికి సంబంధించిన తాళం చెవులను ఇంటికి నైరుతి దిశలో ఉంచవచ్చని సూచిస్తున్నారు.

అలా పెట్టడం వల్ల ఆర్థిక లావాదేవీలు త్వరిత గతిన జరుగుతాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. మనం నిత్యం ఉపయోగించే ఇంటి తాళం చెవులను, వాహనాల తాళం చెవులను, ఆఫీస్ లాకర్ తాళంచెవులను వాయువ్య దిశలో ఉంచడం వల్ల మంచి జరుగుతుందని, ఇది ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక తాళం చెవులను, తాళాలను పెట్టడం కోసం చెక్క హ్యాంగర్ లను ఉపయోగించడం శ్రేయస్కరంగా ఉంటుందని, పొరపాటున కూడా ప్లాస్టిక్ హ్యాంగర్లు ఉపయోగించద్దు.