Site icon HashtagU Telugu

Vastu Tips: టెర్రస్ పై అరటి చెట్టు పెంచుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Vastu Tips

Vastu Tips

ఈ మధ్యకాలంలో చాలా మందికి గార్డెనింగ్ పై ఇంట్రెస్ట్ పెరగడంతో కొంతమంది ఇంటి ముందు సరైన ప్లేస్ లేకపోవడంతో ఇంటి టెర్రస్ పైనే ఎన్నో రకాల మొక్కలను పెంచుతున్నారు. అటువంటి వాటిలో అరటి మొక్క కూడా ఒకటి. పెద్దపెద్ద కంటైనర్లు లేదంటే డ్రమ్ములు తీసుకుని వచ్చి వాటిలో ఈ అరటి మొక్కలను పెంచుతున్నారు. అయితే అరటి మొక్కలను ఇంట్లో పెంచడం మంచిదే అయినప్పటికీ వాటిని పెంచేటప్పుడు కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలట. మరి అరటి మొక్కలు పెంచినప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో అరటి చెట్టును నాటడం ద్వారా బృహస్పతి జాతకంలో బలపడతాడు.

ఇంటి ముందు భాగంలో అరటి చెట్టును ఎప్పుడూ పెంచకూడదు. ఇది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇంటి వెనుక భాగంలో అరటి మొక్కను పెంచుకోవచ్చు. ప్రతి గురువారం అరటి చెట్టుకు పూజ చేయాలి. దాని వల్ల బృహస్పతి , విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇకపోతే అరటి మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. తులసి లేదా అరటి మొక్కను సాధారణంగా ఇళ్లలో నాటుతారు. సనాతన ధర్మంలో మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను నాటడం వలన గురుగ్రహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సంక్షోభం వచ్చినా దూరం అవుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణాల తీరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే పైకప్పుపై అరటి చెట్టును నాటడం వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే..

వాస్తు శాస్త్రం ప్రకారం అయితే ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ అధికంగా ఉంది. అయితే అన్ని మొక్కలను పెంచినట్లు ఇంటి పైకప్పుపై అరటి చెట్టును నాటితే.. అది మీ జీవితంలో సంతోషం కంటే సమస్యలను తెస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. గ్రహాల స్థితి మారుతుంది.. చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.ఆకస్మిక ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.
అరటి చెట్టు ఎక్కడ పెంచాలంటే.. హిందూ మతంలో దేవతలు చెట్లు, మొక్కల్లో నివసిస్తారు. అందువల్ల మీరు ఇంట్లో అరటి చెట్టును పెంచుకోవాలను కుంటే దానిని సరైన దిశలో నాటడం మంచిది. ఇంట్లో అరటి చెట్టును నాటడం ద్వారా బృహస్పతి జాతకంలో బలపడతాడు.