Site icon HashtagU Telugu

Vastu tips: వాస్తు దోషాలు మాయం అవ్వాలంటే ఇంట్లో ఈ ఒక్కటి తప్పనిసరిగా ఉండాల్సిందే?

Mixcollage 02 Feb 2024 11 04 Am 8975

Mixcollage 02 Feb 2024 11 04 Am 8975

మామూలుగానే చాలామంది వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు అన్నది కేవలం ఇంటికి మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్లు సుఖంగా జీవించడానికి కూడా అవసరం. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వాస్తు దోషం వల్ల వచ్చే ప్రతికూల శక్తులు వ్యక్తుల జీవితాల పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి, ఇంట్లో ఉన్న దోషాలను తొలగించడంలో ముఖ్యమైనది, అత్యంత సమర్థవంతమైనది కర్పూరం.ఇంట్లో వాస్తు దోషం ఉంటే కర్పూరంతో కొన్ని నివారణలు పాటిస్తే ఆ వాస్తు దోషం నుంచి కచ్చితంగా బయటపడతారు.

ఇంట్లో కర్పూరం ఒక్కటి ఉంటే చాలు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కర్పూరంతో చేసే కొన్ని వాస్తు దోష నివారణలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోని అన్ని గదుల మూలల్లో కర్పూరాన్ని ఉంచాలి. గదుల మూలలో పెట్టిన కర్పూరం అయిపోతే ఆ స్థానంలో మరొక కర్పూరాన్ని ఉంచాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. రాత్రివేళ వంటగదిలో పని అయిపోయిన తర్వాత ఒక శుభ్రమైన డబ్బాలో కర్పూరాన్నిమరియు లవంగాలను కలిపి కాల్చడం మంచిది. అంతే కాదు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు కర్పూరపు నూనె కలిపి స్నానం చేస్తే అది శరీరాన్ని ఉత్తేజ వంతంగా ఉంచుతుంది.

లవంగాలను, కర్పూరాన్ని కలిపి కాల్చి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, చిరాకులు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటి మూలలలో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం సిరిసంపదలను ఇస్తుంది. అందుకే వాస్తు శాస్త్రంలో వాస్తు దోష నివారణకు ఒక్క కర్పూరం చాలు అని చెబుతున్నారు. కర్పూరంతో ప్రతికూలతల నుండి బయటపడవచ్చు.