Site icon HashtagU Telugu

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఆ దేవుడు ఫోటో పెట్టి పెడితే చాలు.. ఐశ్వర్యం సిద్ధించడం ఖాయం!

Mixcollage 08 Feb 2024 06 38 Am 4404

Mixcollage 08 Feb 2024 06 38 Am 4404

మాములుగా మనం ఇంట్లో ఎందరో దేవుళ్ళ ఫోటోలు దేవతల ఫోటోలు పెడుతూ ఉంటాం. అని వాస్తు ప్రకారం కొంతమంది దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టడం అస్సలు మంచిది కాదు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే దేవుళ్ళ ఫోటోల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు సూచించబడ్డాయి. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోను తప్పనిసరిగా ఉంచుకోవాలి. అయితే ఇంట్లో పెట్టుకునే లక్ష్మీదేవి ఫోటో విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి.

ఏనుగుతో ఉన్న లక్ష్మీ దేవి చిత్రాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ చిత్రంలో ఏనుగు తన తొండం లోకి కలశాన్ని తీసుకున్నట్లుగా ఉన్న ఫోటో మంచి ఫలితాలను అందిస్తుంది. ఏనుగులతో ఉన్న గజలక్ష్మి అమ్మవారి చిత్రాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టుకొని పూజించటం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు, ఆనందం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. గజలక్ష్మి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి ఈశాన్య మూలలో దేవుని గదిలో కుడివైపున ఉంచాలి. ఈ దిశలో గజలక్ష్మి చిత్రపటాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. వారి ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. గజలక్ష్మి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గజలక్ష్మీ చిత్రం అదృష్టానికి, విజయానికి చిహ్నంగా చెబుతారు. లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచటం వల్ల ఇతర దేవతల ఆశీస్సులు కూడా కలుగుతాయి. గజలక్ష్మి చిత్రం, లేదా విగ్రహం ఇంట్లో వచ్చే అడ్డంకులను తొలగించి ముందుకు సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.అందుకే లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్న చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఐశ్వర్యవంతులు కావటం ఖాయం.