Vastu Tips: గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాల్సిందే?

హిందూమతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడ

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:23 PM IST

హిందూమతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది.. ఆ రోజుల్లో ఆ దేవులను విశేషంగా భక్తీశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయా దేవుళ్ళ అనుగ్రహాలు తప్పక కలుగుతాయి. అలాగే వారంలో ఒక్కో రోజు కొన్ని రకాల పనులు నిషేధించబడింది. అలాగే కొన్ని రకాల పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన జీవితమే మారిపోతుంది. అయితే గురువారం రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి నడిచి రావడంతో పాటు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

గురువారానికి అధిపతి బృహస్పతి. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలంగా ఉంటాడో వారు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారని బలంగా నమ్ముతారు. ఇక గురువారం రోజు కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే, ముఖ్యంగా బీరువా, డబ్బులను భద్రంగా పెట్టే లాకర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ధనలక్ష్మి ఇంటికి నడిచొస్తుంది. గురువారం రోజు శ్రీమహావిష్ణువుకి కానీ, సాయిబాబా కి కానీ పూజ చేయాలి. అయితే గురువారం నాడు శివుడిని పూజించిన మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు ఒక కొబ్బరికాయను తీసుకుని శివాలయానికి వెళ్లి, కొబ్బరికాయను శివలింగానికి తాకించి మనసులో ఉన్న కోరికను చెప్పి, శివపార్వతులను పూజించి, ఆపై ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రంగా పెట్టాలి.

అలా చేస్తే ఐశ్వర్యం వస్తుంది. ఏవైనా ప్రత్యేక సందర్భాలలో ఆ కొబ్బరికాయను తీసి పూజలు నిర్వహించుకోవచ్చు అని సూచిస్తున్నారు. గురువారం నాడు ఎవరైతే శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని తులసీదళాలతో, పసుపు రంగు పుష్పాలతో పూజిస్తారో వారు పూజ పూర్తయిన తర్వాత తులసీదళాన్ని, పుష్పాన్ని బీరువాలో పెట్టడం వల్ల అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందట. గురువారం రోజు బీరువాలో దేవుడి పూజకు ఉపయోగించిన ఎర్రటి వస్త్రాన్ని పెట్టినా మేలు జరుగుతుంది. ఇలా చేస్తే అదృష్టం పట్టిపీడించడం ఖాయం. అంతేకాదు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు స్వామికి ఇష్టమైన తమలపాకులను పెట్టి, ఆపై ఆ తమలపాకు పై చందనం, తిలకం పూసి, తమలపాకును జాగ్రత్తగా బీరువాలో పెట్టినా కలిసి వస్తుంది.