చాలామంది వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం గా కొన్ని విషయాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు విషయాలను ఫాలో అవ్వడం వల్ల సానుకూల శక్తులు ప్రవహించి ప్రతీ కూల శక్తులు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. వాస్తు విషయాలను పాటించడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. అయితే మన వంటింట్లో దొరికి లవంగాలను వాస్తు ప్రకారం ఉపయోగించే కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఇంట్లో లవంగాలని ఇలా పెట్టినట్లయితే చాలా లాభాలు ఉంటాయట. ఎలా అంటే..
లవంగాలను దిండు కింద పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయట. సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు. ధనం కూడా కలుగుతుందట. ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు. సంతోషంగా జీవించవచ్చని చెబుతున్నారు. అలాగే లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము. పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుందట. ధనాకర్షణ కలిగి సంతోషంగా ఉండవచ్చని,డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు.
అదేవిధంగా శుక్రవారం నాడు లవంగాల దీపాన్ని పెడితే మంచి జరుగుతుందట. పూజ గదిలో కానీ ఇంటి ముఖ ద్వారం దగ్గర కానీ ఐదు లవంగాలని ఉపయోగించి, దీపారాధన చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందట. శుక్రవారం రోజు చిన్న కప్పులో గళ్ళ ఉప్పు తీసుకొని దానిపై 3 లవంగాలలో పెట్టి ఇంట్లో ఏదైనా ఒక మూలలో పెట్టి మరుసటి రోజు అనగా శనివారం రోజు ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే ప్రవహించే నీటిలో పడేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు