Site icon HashtagU Telugu

Black Cat: నల్ల పిల్లి కనిపించడం మంచిది కాదా.. అశుభమా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 22 Feb 2024 07 38 Pm 9885

Mixcollage 22 Feb 2024 07 38 Pm 9885

హిందూమతంలో జంతువులకు సంబంధించి అనేక విశ్వాసాలు ఉన్నాయి. అందులో ఆవులను పూజించడం, పాములకు పాలు పోయడం లాంటి వాటితో పాటు పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అన్న నియమం కూడా ఒకటి. చాలామంది పిల్లి ఎదురొస్తే మంచిది కాదని ముఖ్యంగా నల్ల పిల్లి ఎదురు రావడం అంత మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే పిల్లి ఎదురు కావడం మంచిది కాదా, అందరూ అంటున్నట్టుగా ఆశుభమా? ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లి దరిద్ర దేవతకు చిహ్నం, పిల్లులు దరిద్రాన్ని మోసుకువస్తాయని చాలా మంది భావిస్తారు.

ప్రతికూల శక్తికి మూలంగా పిల్లుల్ని భావించేవారు, పిల్లిని చూస్తేనే ఏదో కీడు జరుగుతుందని నమ్మేవారు ముఖ్యంగా నల్ల పిల్లుల విషయంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అన్ని సందర్భాలలో మాత్రం కాదు. నల్ల పిల్లి రోడ్డు దాటితే అశుభమని, మనం బయటకు వెళుతున్నప్పుడు పిల్లి ఎదురొస్తే వెళ్లిన పనులు కావని, ఏదో చెడు జరగబోతుందని విశ్వసిస్తారు. అయితే పిల్లి ఎక్కడైనా మూత్ర విసర్జన చేస్తే కూడా అది అశుభ సంకేతంగానే భావిస్తారు. కలలో కూడా పిల్లి కనిపిస్తే అది చెడు సంకేతం అని, భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చూడబోతున్నారని చెబుతున్నారు.

నల్ల పిల్లి ఒక వ్యక్తి ఇంటికి పదేపదే వస్తుంటే అది సదరు వ్యక్తికి దురదృష్ట సూచన అని చాలామంది నమ్ముతారు. అయితే నల్ల పిల్లి విషయంలో అందుకు భిన్నంగా కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది. అలాగే కలలోకి నల్ల పిల్లి వస్తే ఆర్థికంగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు నల్ల పిల్లి కనిపిస్తే త్వరలో మీ ఇంటికి అతిధి రాబోతున్నారని అర్థం. మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు అని చెప్పడానికి ఇది సంకేతం. నల్ల పిల్లి ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్లి దానంతట తానే తిరిగి వెళ్ళిపోతే అది ఆ వ్యక్తి అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి నల్ల పిల్లితో అన్ని అశుభాలే కాదు శుభాలు కూడా ఉంటాయి..

Exit mobile version