Vastu Tips : వాస్తు ప్రకారం హనుమంతుడి చిత్ర పటం ఏ దిశలో ఉండాలంటే..?

సమస్యలు లేని జీవితం ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదోక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు సాగినప్పుడే జీవితానికి ఓ సార్దకత ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 07:00 AM IST

సమస్యలు లేని జీవితం ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదోక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు సాగినప్పుడే జీవితానికి ఓ సార్దకత ఉంటుంది. సంతోషంగా జీవించగలుగుతాం. కానీ కొందరికి ఎంత కష్టపడినా…ఫలితం మాత్రం శూన్యం. నిత్యం ఏదొక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటివారు ఇంట్లో హన్మంతుడికి చిత్రపటాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులున్నా…హనుమంతుని చిత్రపటానికి దండం పెట్టుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి.

వాస్తుశాస్త్రంలో హనుమంతుని చిత్రపటం గురించి పేర్కొన్నారు. ఆయన్ను స్మరించుకుంటే ఎంతటి కష్టమైన సరే పరిష్కారం లభిస్తుంది. శ్రీరాము కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుడు పంచముఖి అవతారం ఎత్తి…రామున్ని కష్టాల నుంచి బయటకు తీసుకువస్తాడు. మీరు పంచముఖి హనుమాన్ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇంట్లో ఈ చిత్రపటాన్ని ఏదిశలో ఉంచాలో తెలుసుకుందాం.

ఇంట్లో ఈ దిశలో పంచముఖి హనుమాన్ ఫొటో ఉంచండి:
వాస్తుశాస్త్రం ప్రకారం పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే ఏ దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించదు. ఇంట్లో దక్షిణం వైపు చూస్తున్నట్లుగా హనుమంతుని ఫొటోను ఉంచండి. ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి దక్షిణ దిశ నుండి బయటకు వెళ్లిపోతుంది. దక్షిణ దిశలో హనుమంతుని ఫొటోను పెట్టినట్లయితే…ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాదు పంచముఖి హనుమంతుని చిత్రపటాన్ని ఇంటికి నైరుతి మూలలో ఉంచడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

పంచముఖి హనుమంతుని ఐదు ముఖాల ప్రాముఖ్యత:
పంచముఖి హనుమంతుని ఐదు ముఖాలకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముఖాలు వేర్వేరు దిశల్లో ఉంటాయి.

వానర్ ముఖ: ఈ ముఖం తూర్పు ముఖంగా ఉంటుంది, ఇది శత్రువులపై విజయాన్ని సూచిస్తుంది.

గరుడ ముఖం: ఈ ముఖం పశ్చిమ దిశలో ఉంటుంది. ఇది జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులను నాశనం చేస్తుంది.

వరాహ ముఖ: ఈ ముఖం ఉత్తరం వైపు ఉంటుంది. వారు దీర్ఘాయువు, కీర్తి శక్తిని ఇస్తుంది.

నరసింహ ముఖ: ఈ ముఖం దక్షిణ దిశకు అభిముఖంగా ఉంటుంది. ఈ అవతారం భయం, ఒత్తిడి, ఇబ్బందులను తొలగిస్తుంది.

గుర్రపు ముఖం: ఈ ముఖం ఆకాశం వైపు ఉంటుంది. ఇది ప్రతి కోరికను నెరవేరుస్తుంది.