Vastu Tips: ఇంట్లో వీటిని అలంకరించుకుంటే చాలు.. దుష్ట శక్తులు పారిపోవడం ఖాయం?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు విషయాలను వాస్తు చిట్కాలను పాటించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే వాస్తు విషయంలో మనం చేసే చ

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 09:15 PM IST

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు విషయాలను వాస్తు చిట్కాలను పాటించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆర్థిక పరిస్థితులకు కారణం కావచ్చు. కాగా చైనీస్ వాస్తులో సైతం విండ్ చైమ్ కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నెగెటివిటిని దూరం పెడతాయి. అంతేకాదు సంపద, ఆనందాన్ని కూడా తెస్తాయి. చాలామంది ఇంట్లో విండ్ చైమ్స్ ని అలంకరించుకుంటూ ఉంటారు. ఇంట్లో విండ్ చైమ్స్ అలంకరించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం జరుపుకుందాం.. వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ అమర్చిన ఇంట్లోకి సానుకూల శక్తి తనంతట తానే ఎవరో ఆహ్వానించినట్టుగానే వచ్చేస్తుంది.

ఫలితంగా ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వాస్తు చెప్పిన దాంటి బట్టి విండ్ చైమ్స్ అలంకరిస్తే ఇంట్లోకి అదృష్టం కూడా వస్తుంది. అలాగే ఆ ఇంట్లో ఉండే వారికి అన్ని విషయాల్లో పురోగతి ఉంటుంది.ఆర్థిక పురోభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి విండ్ చైమ్స్ ని ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఎక్కడైనా విండ్ చైమ్స్ అలంకరించుకోవచ్చు. అయితే తలుపు లేదా కిటికికి వాటిని అమర్చడం చాలా మంచిది. వాస్తు ప్రకారం గాలి వల్ల అవి కదిలి వాటి నుంచి శ్రావ్యమైన ధ్వని ఉద్భవిస్తుంది. ఈ శబ్ధం ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తుంది. అందువల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొనడంతో పాటు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు.. అయితే మార్కెట్ లో మనకు చెక్క, లోహం, టెర్రాకోటా, పింగాణి ఇలా రకరకాల మెటిరియల్ తో తయారు చేసిన విండ్ చైమ్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటిలో ఏదైనా ఇంట్లో లేదా ఆఫీసులో, వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయితే వీటి నుంచి వచ్చే ధ్వని మితంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువ ధ్వని చేసే విండ్ చైమ్స్ వల్ల మంచి జరగడానికి బదులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింప జేస్తాయి. కనుక ఈ జాగ్రత్త తప్పనిసరి. విండ్ చైమ్స్ ను ఆరుబయట కూడా వేలాడదీయవచ్చు. అదేవిధంగా తోటలో కూడా అమర్చుకోవచ్చు కానీ చెట్లకు మాత్రం వేలాడదీయకూడదు. బెడ్ రూమ్ లోపల లేదా బెడ్ రూమ్ కిటికి దగ్గర కూడ చాలా మంచిది. బెడ్ రూమ్ లో అలంకరించుకోవడానికి చెక్క లేదా వెదురుతో చేసిన విండ్ చైమ్స్ ఉత్తమమైనవి. బెడ్ రూమ్ లో బ్లూకలర్ లో ఉండే విండ్ చైమ్స్ అలంకరించుకుంటే నిద్ర లేమి వంటి సమస్యలకు పరిష్కారం దొరకుకుతుంది. పశ్చిమాన విండ్ చైమ్స్ ను అమర్చుకుంటే ఇంట్లోని వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది. పిల్లలు కూడా చదువులో రాణిస్తారు. వాయవ్యంలో అమర్చిన లోహపు విండ్ చైమ్స్ ఇంట్లో సమృద్ధికి దోహదం చేస్తాయి. ప్రతికూల శక్తులు, దురదృష్టం పారద్రోలబడుతుంది.నైరుతి, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో మట్టి లేదా పింగాణితో చేసిన విండ్ చైమ్స్ అలంకరించుకోవడం మంచిది. దక్షిణ, తూర్పు, లేదా ఆగ్నేయంలో చెక్క తో విండ్ చైమ్స్ ఎంచుకోవడం మంచిది.