జీవితంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల అన్నది పెద్దది తప్పనిసరిగా ఉంటుంది. వారికి నచ్చిన విధంగా ఇల్లు ని కట్టించుకోవాలని సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి సొంతింటి కల అన్నది ఎప్పటికీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇంకొందరు చాలా కష్టపడి అయినా సరే కొత్త ఇంటిని, సొంత ఇంటిని కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కొత్త ఇంటిలో గృహ ప్రవేశాన్ని కూడా ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అయితే ఈ గృహ ప్రవేశం వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన కల. ఈ సమయం ఏ వ్యక్తి జీవితంలోనైనా చాలా విలువైన, మరపురాని క్షణం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఆధునికత పేరుతో కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చాలా మంది వాస్తు నియమాలను పాటించకపోవడం చాలా తరచుగా జరుగుతుంది.
ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఆ కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయట. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు నివసిస్తున్న పాత ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. పాత ఇంట్లోనే వస్తువులు తీసుకెళ్లడం మంచిదే కానీ పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను అస్సలు తీసుకెళ్లకూడదని చెబుతున్నారు. మరి పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదోఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాత ఇంట్లో వాడిన చీపురుని ఎట్టి పరిస్తితులలో తీసుకెళ్లకూడదట. చాలామంది కొని కొద్ది రోజులు అయింది కదా, ఉపయోగిస్తే ఏం కాదులే అని ఆవే చీపురును మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు చేయకూడదని చెబుతున్నారు. అదేవిధంగా తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ఏవైనా సరే కొత్త ఇంట్లోకి తీసుకెళ్లకూడదట. ఉతకని మాసిన వస్త్రాలు బట్టలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్లకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా పనిచేయని గడియారాలు పొరపాటున కూడా తీసుకెళ్లకూడదట. పగిలిన గాజు వస్తువులు గాజు పాత్రలు తీసుకెళ్లకూడదని దీనివల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు.
అలాగే విరిగిపోయిన ఫర్నిచర్ ని కూడా ఇంట్లోకి తీసుకెళ్లకూడదట. మూత లేకుండా గాలి చొరబడే విధంగా ఉప్పును ఎట్టి పరిస్థితులలో ఉంచకూడదు. ఎందుకంటే ఒప్పుకో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి అలా మీరు పాత ఇంట్లో మూత లేకుండా గాలికి వదిలేసిన ఉప్పు ఉంటే దానిని అక్కడే వదిలేయడం మంచిది. పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ కూడా కొత్త ఇంట్లోకి తీసుకెళ్లకూడదట..