Site icon HashtagU Telugu

Vastu Tips: వంటగదిలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే.. లేదంటే తీరని నష్టం!

Mixcollage 08 Feb 2024 11 55 Am 6398

Mixcollage 08 Feb 2024 11 55 Am 6398

మామూలుగా వాస్తు శాస్త్ర నిపుణులు ఇంట్లో చాలా విషయాలలో వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలని చెబుతూ ఉంటారు. వంటగది విషయంలో కూడా అనేక రకాల నియమాలను పాటించాలి. వంటగది నియమాలు పాటించకుంటే తీరని నష్టం జరుగుతుంది. ఇంట్లో సానుకూల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం కోసం వంట గదిని నిర్మించే ముందు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను తెలుసుకుందాం. ఇంటికి ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకోవాలి. ఇంటికి ఆగ్నేయంలో వంటగది నిర్మించుకోవడం సాధ్యం కాకపోతే ఇంటికి వాయువ్య భాగంలో రెండవ ప్రత్యామ్నాయంగా వంటగదిని నిర్మించుకోవాలి.

వంటగదిలో వంట చేసేవారు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు తూర్పు వైపుగా వారి ముఖం ఉండేలా కిచెన్ ప్లాట్ ఫామ్ నిర్మించుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది బాగా వెంటిలేషన్ ఉండేవిధంగా చూసుకోవాలి. ప్రతి వంట గదికి తప్పనిసరిగా కిటికీ ఉండాలి. ఉదయపు సూర్యకాంతి ప్రవేశించే విధంగా తూర్పువైపున ఉన్న కిటికీని ఉపయోగించుకోవాలి. వంటగదిలో అన్ని విద్యుత్ ఉపకరణాలు దక్షిణవైపున లేదా ఆగ్నేయం వైపు ఉండేలా చూసుకోవాలి. వంటగదిలో పెట్టుకుని హోమ్ అప్లయెన్సెస్ ఫ్రిడ్జ్, ఓవెన్, మిక్సర్ గ్రైండర్ ఆగ్నేయం వైపు ఉండేలా పెట్టుకోవాలి. పొరపాటున కూడా ఈశాన్యం వైపు వాటిని పెట్టకూడదు. ఇంట్లో ఫ్రిజ్ ను గోడకు కాస్త దూరంలో పెట్టాలి.

వంటగదిలో ఉత్తరం తూర్పు గోడలను ఖాళీగా ఉంచాలి. దక్షిణం మరియు పశ్చిమ గోడలకు కిచెన్ క్యాబినెట్ లను అమర్చాలి. అంతేకాదు వంటగదిలో ఉపయోగించే రంగులను కూడా ప్రకాశవంతమైన రంగులు ఉపయోగించాలి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, చాక్లెట్, పింక్, ఆరెంజ్ వంటి రంగులు ఇంటికి వేసుకోవడం మంచిది. వంటగది ప్రవేశ ద్వారం కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. వంటగది తలుపు తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు ఉండాలి. వంటగది యొక్క ప్రధాన తలుపును దక్షిణ దిశలో ఉండకూడదు. వంటగది ఇంటికి ఈశాన్య మూలలో ఉండకూడదు. టాయిలెట్ వంటగదికి పైన, క్రింద లేదా ఆనుకొని ఉండకూడదు. ఈ విధంగా వంటగది విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. లేదంటే అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు.