Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

మామూలుగా సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని మరికొన్ని రకాల పనులు చేయాలని చెబుతూ ఉంటారు పండ

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:47 PM IST

మామూలుగా సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని మరికొన్ని రకాల పనులు చేయాలని చెబుతూ ఉంటారు పండితులు. తెలిసి తెలియక చేసే కొన్ని రకాల తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల పనులు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు మనకున్న ఆర్థిక నష్టాలు మానసిక సంస్థలు తొలగిపోయి సంతోషంగా జీవించవచ్చు. అయితే సూర్యాస్తమయం తరువాత కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు అదృష్టం పట్టిపీడించడం ఖాయం, వర్షం కురుస్తుంది అంటున్నారు పండితులు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా సూర్యోదయానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో, సూర్యాస్తమయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో కూడా పూజలు చేసే వారికి వారి జీవితంలోనే అనేక సమస్యల నుండి, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు తప్పనిసరిగా సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులను చేయాలి. సూర్యాస్తమయం సమయంలో అస్తమించే సూర్యుడిని పూజిస్తే, సూర్య భగవానుడికి నమస్కరిస్తే కుటుంబంలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే సూర్యాస్తమయం సమయంలో పూజ గదిలో దేవుడికి పూజలు చేసి, తులసి మొక్కకు దీపారాధన చేసి పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న గదులలో ఏ మూలన చీకటి ఉండకుండా చూసుకోవాలని, ప్రతి చోట దీపాన్ని వెలిగించాలి.

ఇక సూర్యాస్తమయం సమయంలో వ్యక్తి ఇంట్లో మంచంపై పడుకోకూడదని, నిద్రపోకూడదు. ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంట్లో నివాసం ఉండకుండా వెళ్ళిపోతుందని చెబుతారు. అంతేకాదు సూర్యాస్తమయం సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం వల్ల, వారికి మనస్ఫూర్తిగా నమస్కరించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించి, వారి జీవితంలో సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి సూర్యాస్తమయం తరువాత పైన చెప్పిన పనులు చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా మాయం అవడం ఖాయం అంటున్నారు పండితులు.