Vasthu Tips: స్త్రీలు తెలియక ఇంట్లో ఇలాంటి పనులు చేస్తున్నారా.. దరిద్రమే!

వాస్తు శాస్త్ర ప్రకారం మామూలుగా పురుషులు స్త్రీలు ఇంట్లో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. పురుషులు చేయకూడని ప

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 08:30 PM IST

వాస్తు శాస్త్ర ప్రకారం మామూలుగా పురుషులు స్త్రీలు ఇంట్లో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. పురుషులు చేయకూడని పనులు ఏ విధంగా అయితే ఉంటాయో, అదే విధంగా స్త్రీలు చేయకూడని పనులు కూడా అనేకం ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. మరి స్త్రీలు ఇంట్లో పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ తెలిసి తెలియక చేస్తే వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వివాహితలు అయిన స్త్రీలు ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి సమయంలో గాజులు,కమ్మలు, మంగళ సూత్రాలు తియ్యకూడదు.

వీరు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు. మంగళవారం నాడు భర్త పిల్లలు ఎవరు క్షవరం కానీ, గడ్డం కానీ చేసుకోవడం మంచిది కాదని చెప్పి నిలువరించాలి. అలా చేస్తే దరిద్రం వస్తుందన్న విషయాన్ని స్త్రీలు చెప్పాలి. ఇక ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షం లోనే చెయ్యాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున వారు కానీ, పిల్లలు కానీ దిండు పై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది. శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు స్త్రీలు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం, స్థిరంగా నిలబడకుండా డాన్స్ చేస్తున్నట్లగా తిరుగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు. పెళ్లైన స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. అలాగే ఆహారం తినకుండా నిద్రించకూడదు. అదేవిధంగా స్త్రీలు బహిస్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా, రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది.

మంగళ, శుక్రవారాల్లో కాకుండా ఇంటిని బూజు, దుమ్ము లేకుండా స్త్రీలు దులుపుకొని సర్ది పెట్టుకోవాలి. ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని, పీడ, పీనుగ వంటి పదాలను పలకరాదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలం గా కొబ్బరిచిప్పలు ఇచ్చేటప్పుడు, కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వస్తే వారిని ఆహ్వానించకూడదు. ఇక బాధలో ఉన్న కుటుంబాన్ని విచారించి అక్కడి నుంచి వెళ్లే స్త్రీలు వెళ్లి వస్తానని కూడా చెప్పకూడదు. పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. ఇలా పైన చెప్పిన విషయాలను తప్పకుండా పాటించాలి. లేదంటే లేనిపోని సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది.