Site icon HashtagU Telugu

Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు జారవిడచకండి.. లేదంటే ఆర్థిక నష్టం కలగడం ఖాయం?

Mixcollage 04 Feb 2024 06 07 Pm 7217

Mixcollage 04 Feb 2024 06 07 Pm 7217

మామూలుగా కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని రకాల వస్తువులు చేయి జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేతి నుండి వస్తువులు జారి పడిపోవటాన్ని చాలామంది దురదృష్టంగా భావిస్తారు. నిజమే కొన్ని వస్తువులు చేతి నుండి జారి పడిపోవడం నిజంగానే దురదృష్టమని చెప్పాలి. చాలాసార్లు చేతిలో నుంచి ఏదో ఒకటి జారి నేలమీద పడిపోతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు చేతుల నుండి జారి నేలపై పడడం చాలా అశుభంగా చెబుతారు. కొన్ని ముఖ్యమైన వస్తువులు అయితే కిందపడి పగిలిపోతూ ఉంటాయి. కాగా పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను అస్సలు కింద పడేయకూడదు అంటున్నారు పండితులు.

మరి ఎలాంటి వస్తువులు చేయి జారకుండా జాగ్రత్త పడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అటువంటి వాటిలో ఉప్పు కూడా ఒకటి. చేతులలో నుండి ఉప్పు జారిపడితే వారి జాతకంలో బలహీనంగా శుక్రుడు, చంద్రుడు ఉన్నట్టు చెబుతారు. ఇది వ్యక్తుల ఆరోగ్య జీవితంపై, కుటుంబ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చేతుల నుండి జారి పడకూడని మరొక వస్తువు నూనె. నూనె చేతుల నుండి జారి పడిపోవడం అంటే శనికి ఆగ్రహం తెప్పించటమే. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. జాతకంలో శని ప్రతికూల ఫలితాలు ఇచ్చే సమయంలో చేతుల నుండి నూనె జారిపడుతుంది. దీంతో వారు జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి సంకేతమని గుర్తించాలి. చేతుల నుండి జారిపడిపోకూడని మరొక ముఖ్యమైన వస్తువు పూజ పళ్లెం.

పొరపాటున కూడా చేతుల నుండి పూజ పళ్లెం జారి పడిపోకూడదు. అలా చేజారిపోయింది అంటే భగవంతుడు మీ పట్ల దయ చూపడు అని అర్థం. ఇది భవిష్యత్తులో అతి పెద్ద సమస్యలకు కారణమవుతుందని సంకేతం. చేతుల నుండి జారిపడిపోకూడని మరొక ముఖ్యమైన వస్తువు పాలు. చేతుల నుండి పాలు పడిపోవడం ఆర్థిక సమస్యలకు మూలం అవుతుందని, ఇది అశుభ సంకేతమని చెబుతున్నారు. పాలు జారి పడిపోయి నేలపాలైతే కష్టం అంతా వృధా అవుతుందని చెప్తారు. ఈ వస్తువులు చేతుల నుండి జారి పడిపోతే కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన వస్తువులు జారిపోకుండా చాలా జాగ్రత్త వహించాలి. పొరపాటున ఆవస్తులు చేజారితే ఆర్థిక నష్టం శుభం గ్యారెంటీ.