Site icon HashtagU Telugu

Vastu tips: కలబందను ఇంట్లో ఈ దిక్కున పెడితే చాలు కాసుల వర్షం కురవాల్సిందే?

Mixcollage 31 Jan 2024 08 57 Pm 1141

Mixcollage 31 Jan 2024 08 57 Pm 1141

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అటువంటి వాటిలో కలబంద మొక్క కూడా ఒకటి. ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామంది ఇంట్లో కలబంద మొక్కను ఇష్టంగా కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల నియమాలు పాటించడం తప్పనిసరి. మరి ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని వస్తే..మొదట కలబందను ఏ దిశలో పెట్టాలి అన్న విషయానికి వస్తే..

వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కలను నాటడం చాలా శుభప్రదం. కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయి. ఈ మొక్కను ఇంట్లో నాటటానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది. కలబందను ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు. మీకు ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి. కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదు.

వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలను, ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను గుర్తుంచుకోవాలి.