Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు.. అదృష్టం పట్టిపీడించాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 04:00 PM IST

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని మొక్కలు పెరట్లో బయట పెంచుకుంటే మరి కొన్ని మొక్కలు ఇంట్లోనే లోపల పెంచుకుంటూ ఉంటాం. అలా ఇండోర్ ప్లాంట్స్ అంటూ ఇప్పటిలో చాలామంది ఎన్నో మొక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కిచెన్‌లో, బెడ్‌రూమ్, బాత్రూమ్‌లో కూడా మొక్కల్ని పెడుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఆ ప్లాంట్ మరేదో కాదు జేడ్ ప్లాంట్. దీనినే క్రాసులా మొక్క అని కూడా పిలుస్తారు. ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుందట. ఇదే విషయాన్ని నిపుణులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ మొక్క ఇంట్లోని పాజిటివ్‌నెస్ కూడా పెంచుతుందట. అలాగే ఇంటి అందాన్ని కూడా ఇది రెట్టింపు చేస్తుంది. జేడ్ మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలట.

ఈ దిశలో ఉంచితే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఇంట్లో సుఖఃశాంతులను తీసుకువస్తుంది. అలాగే ప్రధాన ద్వారం కుడి వైపున ఈ మొక్కను పెడితే.. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఆఫీసుల్లో అయితే నైరుతి తిశలో పెట్టకోవడం మంచిది.