Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఇల్లు అలా ఉండాల్సిందే?

  • Written By:
  • Updated On - March 25, 2024 / 03:42 PM IST

మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల విధివిధానాలను పాటించాలి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. కొన్ని రకాల నియమాలను పాటించాలి. మరి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ బూజు, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైన, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్ర పోవడం మంచిది కాదు. సాయంత్ర సమయంలో నిద్రపోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు. ఇక ఏ ఇంట్లో అయితే నిత్యదీపారాధన చెయ్యరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు. ప్రతి రోజూ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని, కుటుంబ సభ్యులకి చిరాకు పోయి ప్రశాంతత ఉంటుంది.

మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన పనులు చేస్తే సకల శుభాలు ఆమె అనుగ్రహం ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి, ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు, కుంకుమలతో పూజించిన ఇళ్ళలో కూడా లక్ష్మీ దేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుందట. ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా, నిత్యం ఏవైనా పూలతో అమ్మవారికి పూజా చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుంది.