Vastu Tips: ఈ విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మి ఇంట్లో తిష్ట వేయడం ఖాయం?

మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సమస్యలు ఎదురవ్వడం అన్నది కామన్. ఈ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటా

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 08:30 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సమస్యలు ఎదురవ్వడం అన్నది కామన్. ఈ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం రకరకాల పరిహారాలు పూజలు పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు వాస్తు ప్రకారంగా కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలను ఈజీగా అధిగమించవచ్చు. ఇంతకీ ఆ విగ్రహాలు ఏవి? ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టుకోవాలి అన్న విషయానికి వస్తే..

వాస్తు శాస్త్రంలో దిశలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం.. ప్రతి వస్తువును సరైన దిశలో ఉంచితే మాత్రమే ప్రయోజనం పొందుతారు. ఇంటి అలంకరణ కోసం కూడా ఎన్నో శిల్పాలను, విగ్రహాలను పెడుతారు. అయితే ఈ విగ్రహాలను వాస్తు ప్రకారం పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదు. ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఉత్తర దిశను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే దేవతలు, దేవుళ్లు ఈ దిశలోనే నివసిస్తారని నమ్ముతారు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచండి. దీనివల్ల మీరు ధనలాభం పొందుతారు. అంతేకాదు మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

వాస్తు ప్రకారం మీరు మీ డ్రాయింగ్ రూమ్ లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచితే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందువచ్చు. అలాగే బాతు దంపతుల విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా సాగుతుంది. హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే ఆవును పూజిస్తారు. అందుకే మీ ఇంట్లో కంచు కామధేను ఆవు విగ్రహాన్ని పెట్టాలి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సనాతన ధర్మంలో తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. తాబేలును ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే మీరు డ్రాయింగ్ రూమ్ లో లోహంతో చేసిన తాబేలును కూడా ఉంచొచ్చు. ఇది మీ సంపదను పెంచే అవకాశం ఉంది.