ఇంట్లో ఎనర్జీ చెడుగా ఉంటే ఆ ప్రభావం జీవితంపై కూడా కనిపిస్తుందట. మనం ఎదుర్కొనే సమస్యలకు వాస్తు విషయాలు కూడా కారణం కావచ్చట. అయితే ఆర్ధిక సమస్యల నుంచి బయట పడటం కోసం 7 రకాల పరిహారాలు పాటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఎనర్జీ చెడుగా ఉంటే జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు కొన్ని పనులు చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
నీలి సీసాను నీటితో నింపి మనీ ప్లాంట్ నాటాలి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. దీన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. అలాగే పూజ గదిలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు చిరిగిపోయినా లేదా విరిగిపోయినా, వాటిని మొదట మార్చాలి. దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందట. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని శ్రీ లక్ష్మీ సూక్తం పఠించాలట. చిరిగిన బూట్లు, చెప్పులు, బట్టలు ఇంట్లో ఉంటే వాటిని ఇంటి నుంచి తొలగించాలని చెబుతున్నారు. అలా చేయడంలో విఫలమైతే ఆర్థికంగా నష్టపోయి, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే అవకాశం ఉందట.
పేదవాడికి అన్నం పెట్టడం లేదా అమావాస్య రోజున పండ్లు దానం చేయడం వల్ల డబ్బు సమస్య తీరుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు లక్ష్మీ ఆలయంలో చీపురును దానం చేయాలట. గురు, శుక్రవారాల్లో తులసిని ఆరాధించాలట. ఆదివారం మినహా ప్రతిరోజూ నీటిని అందించాలని చెబుతున్నారు..