Site icon HashtagU Telugu

Washing Clothes: రాత్రిపూట బట్టలు ఎందుకు ఉతకకూడదో మీకు తెలుసా?

Washing Clothes

Washing Clothes

ప్రస్తుత రోజుల్లో మనుషుల ఉరుకుల పరుగుల జీవితంలో పనులను సక్రమంగా చేసుకోలేకపోతున్నారు. అంటే ఉదయం చేయాల్సిన పనులు రాత్రులు,,రాత్రులు చేయాల్సిన పనులు ఉదయం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా సిటీ లలో ఉండే వారి జీవితం ఇలాగే ఉంటుందని చెప్పవచ్చు. తిని తిండి నుంచి కట్టుకునే బట్టలు బట్టలు ఉతకడం వరకు ప్రతి ఒక్క విషయంలో మార్పులు వచ్చాయి. ఉదయం ఆఫీసు వర్క్ ల మీద తొందర తొందరగా వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పనులను చేసుకుంటూ ఉంటారు.

అటువంటి వాటిలో మురికి బట్టలను రాత్రి సమయంలో వాష్ చేయడం కూడా ఒకటి. చాలామంది రాత్రి సమయంలో బట్టలు ఉతకడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ విధంగా చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మురికి బట్టలు ఉతకడానికి సరైన సమయం ఉందట. అందుకే బట్టలను రాత్రి సమయంలో ఉతకకుండా ఉదయం సమయంలో ఉతకాలని చెబుతున్నారు. అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళే వారు సమయాన్ని వృథా చేయకుండా రాత్రి సమయంలో అన్ని పనులను పూర్తి చేసుకోవాలని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం సరికాదట.

రాత్రి సమయంలో బట్టలు ఉతికితే ఆ తడి బట్టలు ఆరు బయట ఆరబెట్టవద్దు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందట. బట్టలను ఎల్లప్పుడూ సూర్యోదయం తర్వాత మాత్రమే ఉతుక్కోవడం మంచిదని చెబుతున్నారు. ఉతికిన బట్టలను సూర్య రశ్మిలో ఆరబెట్టడం మంచిది. ఎండలో బట్టలను అరబెట్టడం వలన ప్రతికూల శక్తి పోతుందట. అంతేకాదు ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనం అవుతాయి. అలా ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రసారం అవుతుందట. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుంది. రాత్రి బట్టలు ఉతకడం, బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. అంతేకాదు బట్టల్లో ఉన్న క్రిములు చల్లదనానికి అందులో ఉంటాయి. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించడం ఆరోగ్యానికి హానికరం. ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి ఇకమీదట రాత్రి సమయంలో బట్టలను అస్సలు ఉతకకండి.