మామూలుగా హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఇంటి బయట తులసి మొక్క ఉంటుంది. తులసిదేవికి నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లోకి యమ బటులు రారు అని అంటుంటారు. అయితే చాలామంది తులసి మొక్కలు మాత్రమే పూజిస్తే మరి కొందరు తులసి మొక్క పక్కన కొన్ని రకాల మొక్కలను కూడా పెంచుతూ ఉంటారు. దీని వల్ల ఆ ఉంట్లో అశాంతి నెలకుంటుంది. కుటుంబంలో ఆనందం ఆవిరి అయిపోతుంది. మరి ఇంతకీ తులసి మొక్క వద్ద ఎలాంటి మొక్కలు పెంచకూడదు అన్న విషయాన్ని కోస్తే..
కాక్టస్ మొక్కను ఇంటి అలంకరణలో భాగంగా పెంచుతుంటారు. కానీ తులసి దగ్గర ఈ మొక్కను పెంచకూడదట. ముళ్ల మొక్కలు కేతు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయట. ఈ మొక్కలను తులసి పక్కన పెంచితే ఆ ఇంటి వ్యక్తులకు కష్టాలు పెరుగుతాయట. కాక్టస్ మొక్కను తులసి దగ్గరే కాదు ఇంట్లో కూడా పెంచకూడదని దీనివల్ల శక్తులు ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే తులసి మొక్క వద్ద పాల లాంటి ద్రవాన్ని స్రవించే మొక్కలు కూడా పెంచకూడదట. ఎందుకంటే ఇవి ప్రతికూలతలను పెంచడంతోపాటు ఇంట్లో గొడవలు సృష్టిస్తాయని,కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరుగుతాయని చెబుతున్నారు.
కాబట్టి పైన చెప్పిన మొక్కలను తులసి మొక్క వద్ద పెంచకపోవడం మంచిది. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను ఉంచే స్థలంలో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలట. తులసిని పొరపాటున కూడా చీకటి ప్రదేశంలో ఉంచకూడదట. అలాగే తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారి ముట్టుకోవడం ఆకలిదించడం వంటివి చేయకూడదని కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలని చెబుతున్నారు.