‎Dussehra: దసరా పండుగకు అంతా మంచే జరగాలంటే ఇంట్లో నుంచి వీటిని తొలగించాల్సిందే!

‎Dussehra: దసరా పండుగ రోజు మనకు అంతా మంచే జరిగి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా పనులు విజయవంతం అవ్వాలంటే ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించాలని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dussehra (2)

Dussehra (2)

‎Dussehra: హిందువులు జరుపుకునే పండుగలు దేవి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. ఎందుకంటె ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజుల తర్వాత దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దసరా పండుగను జరుపుకునే ముందు ఇంట్లో నుంచి కొన్ని రకాల వస్తువులను తొలగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

‎ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీ ఇంట్లోని పూజగదిలో విరిగిన విగ్రహాలు ఉంటే, శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యేలోపు వాటిని తొలగించడం మంచిదని,ఆ విగ్రహాలను పారే నీటిలో వదిలేయవచ్చని చెబుతున్నారు. విరిగిన విగ్రహాలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని పెంచుతాయట. దానివల్ల కుటుంబంలో కష్టాలు, నష్టాలు, బాధలు పెరిగిపోతాయని చెబుతున్నారు. నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు మీ ఇంట్లో ఉన్న పాత బూట్లు చెప్పులను పడేయాలని చెబుతున్నారు. ఇవి ప్రతికూలతకు చిహ్నం. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల పేదరికం వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, నష్టాలు తప్పవని చెబుతున్నారు.

‎ అలాగే ఇంట్లో పాడైపోయిన గడియారాలు, విరిగిపోయిన గాజు వస్తువులు ఉండటం మంచిది కాదట. అవి దురదృష్టాన్ని తెస్తాయని, కాబట్టి మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉంటే నవరాత్రులు ప్రారంభమయ్యే ముందే బాగు చేయించడం లేదా వాటిని ఇంటి నుంచి తొలగించడం లాంటివి చేయాలనీ చెబుతున్నారు. అదేవిధంగా చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతుంటారు. కాబట్టి విరిగిన లేదా పాడైపోయిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదట. శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి విరిగిన లేదా పాడైపోయిన చీపురును బయట పడయాలని చెబుతున్నారు.

  Last Updated: 29 Sep 2025, 08:45 PM IST