Vastu Tips: ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకుంటున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!

మామూలుగా మనం ఇంట్లో పెరట్లో ఎన్నో రకాల గులాబీ మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. గులాబీ మొక్కలను ఇష్టపడని వారు ఉండరు. అయితే గులాబీ మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ, వాస్తు నియమాలను పాటించడం తప్పనిసరి.

  • Written By:
  • Publish Date - July 9, 2024 / 05:37 PM IST

మామూలుగా మనం ఇంట్లో పెరట్లో ఎన్నో రకాల గులాబీ మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. గులాబీ మొక్కలను ఇష్టపడని వారు ఉండరు. అయితే గులాబీ మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ, వాస్తు నియమాలను పాటించడం తప్పనిసరి. మరి ఇంతకీ గులాబీ మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటాలి? ఏ దిశలో నాటితే మంచి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకోవాలంటే కొన్ని రకాల వాస్తు నియమాలు తప్పనిసరి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిశలో గులాబీ మొక్కలను నాటాలి.

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు పువ్వులు నాటడానికి ఈ దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో గులాబి చెట్టును నాటడం వల్ల ఇంటి యజమానికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుందట. అంతే కాకుండా ఈ చెట్టు కుటుంబ సంబంధాలను బలంగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ఎరుపు రంగు గులాబీని శక్తివంతంగా భావిస్తారు. అయితే తెలుపు రంగు గులాబీలను శాంతికి సూచికగా పరిగణిస్తారు. అందువల్ల ఈ గులాబీ చెట్లను పెంచుకోవడం వలన ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని నమ్మకం. అలాగే ఎవరికైనా కుటుంబంలో జీవితంలో సమస్యలు ఉంటే అలాంటివారు ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించడం మంచిది.

ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు సాయంత్రం హారతి సమయంలో గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనితో పాటు శుక్రవారం దుర్గాదేవికి 5 రకాల గులాబీ పువ్వులను సమర్పించాలి. దీంతో వీలైనంత త్వరగా డబ్బు కొరత తీరుతుంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఎప్పుడు కూడా గులాబీ మొక్కలను ఇంటికి ఎదురుగా నాటకూడదు. అలా ఇంటికి ఎదురుగా గులాబీ మొక్కలు ఉంటే ఆ ఇంట్లో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.. కుటుంబ సభ్యుల మధ్య బంధం కూడా అంత గట్టిగా ఉండదు.

Follow us