Site icon HashtagU Telugu

Pooja: పూజ చేసేటప్పుడు ఈ దిశగా కూర్చుని చేస్తే చాలు అన్ని శుభాలే!

Pooja

Pooja

మామూలుగా చాలామంది ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల అలాంటి ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవని నమ్ముతూ ఉంటారు. అయితే పూజ చేయడం మంచిదే కానీ పూజ చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. మరి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను గుర్తుంచుకోవాలో అలాగే పూజ చేసేటప్పుడు ఏ దిశగా కూర్చుని చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి.

ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అందుకే పూజ చేసేటప్పుడు మీరు ఈ దిశలో ఉండి దేవుడిని పూజిస్తే ఎన్నో రెట్లు ఫలితాలను పొందవచ్చట. అంతేకాకుండా తూర్పు దిక్కున ముఖం పెట్టి పూజించడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారట. కాగా లక్ష్మీదేవిని సంపద దేవతగా భావిస్తారు. అందుకే మీరు ఉత్తరం దిక్కు ముఖం పెట్టి అమ్మవారిని పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు కూడా కలుగుతాయట. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలని చెబుతున్నారు. చాలామంది దేవుళ్ళపై ఉన్న భక్తితో ఇంట్లోనే ఒక చిన్నపాటిని గుడిని నిర్మించుకుంటూ ఉంటారు.

అయితే గుడిని కట్టేటప్పుడు దిశ చూసుకోవడం కూడా తప్పనిసరి. మీ ఇంట్లో గుడి ఎక్కడ కట్టినా కూడా ఆ దేవుడి తలుపులు ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందట. అలాగే సూర్యకిరణాలు, స్వచ్ఛమైన గాలి వచ్చే విధంగా ఆలయానికి ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే గనుక వాస్తు దోషం కూడా పోతుంది.