Vastu Tips: పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ చెట్లను, మొక్కలను అస్సలు నాటకండి.. ఒకవేళ నాటారో?

  • Written By:
  • Updated On - March 28, 2024 / 05:18 PM IST

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే ఇంటి బయట పెరట్లో కొన్ని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని రకాల చెట్లను కూడా పెంచుతూ ఉంటాం. అయితే వాస్తు ప్రకారంగా తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఒకవేళ పెంచితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు వెంటాడుతాయి. అలా వాస్తు ప్రకారంగా ఇంట్లో కొన్ని రకాల చెట్లు మొక్కలు పెంచకూడదు అంటున్నారు పండితులు.

ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సహజంగా ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి, జమ్మి వంటి మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి. అయితే ప్రతి మొక్క ఇంటికి శ్రేయస్కరం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కాకర కాయ పాదుని ఇంట్లో ఎప్పుడూ పెంచకూడదు. ఇలా ఈ కాకరకయ తీగని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటి ఆర్థిక స్థితి, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్మకం. కనుక ఇంట్లో కాకర మొక్కను నాటడం మంచిది కాదు. వాస్తు ప్రకారం కాకర కాయ మొక్కను ఇంట్లో నాటడం నిషేధించబడింది.

ఎందుకంటే ఈ మొక్క చేదుగా ఉంటుంది. కనుక దీని నుండి వెలువడే శక్తి కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత వస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఏర్పడేలా చేస్తుంది. అలాగే ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఇంట్లో కాకరకాయ మొక్కను నాటడం కుటుంబ సభ్యుల పురోగతిని కూడా ప్రభావితం చేస్తుందని నమ్మకం. కనుక ఇంట్లో కాకర మొక్కను పెంచుకోవడం సుఖ సంతోషాలకు అశుభకరమైనదిగా భావిస్తారు. కాకరకాయ నుంచి వెలువడే శక్తి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడవచ్చు. కనుక ఈ మొక్కను ఇంట్లో నాటడం నిషేధం అంటూ వాస్తు శాస్త్రం పేర్కొంది. ఏయే చెట్లను ఇంట్లో నాటడం అశుభం .అంతే కాకుండా ఇంట్లో ముళ్ల మొక్కలు, ఈత చెట్టు, చింత చెట్టు, రావి చెట్టు వంటివి నాటడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. అయితే మీరు ఇంట్లో ఇప్పటికీ కాకర కాయ తీగను పెంచాలనుకుంటే దానిని మీ ఇంటి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు. అప్పడు ఇంటి సభ్యులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు.