Ganesh: ఇంట్లో గణేష్ విగ్రహం పెడుతున్నారా.. అయితే ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదో తెలుసా?

విగ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 09:20 PM IST

విగ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు ఇంట్లో వినాయకుడి ప్రతిమను పెట్టి పూజిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో చాలా మందికి తెలియదు. ఇంట్లో ఎటువంటి ప్రదేశాలలో గణేష్ విగ్రహాన్ని పెట్టవచ్చు ఎటువంటి ప్రదేశంలో పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. తెల్లటి వినాయకుడని స్వేత గణపతి అని కూడా పిలుస్తారు. తెల్లటి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పును తెచ్చిపెడుతుంది. మీ ఇంటి వెలుపల గణేశ విగ్రహాన్ని దేవత వెనుకవైపు ఉండేలా ఉంచడం మంచిది.

ఏ దిశలో ఉంచాలి అనే విషయానికి వస్తే.. గణేశ విగ్రహాన్ని ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో ఉంచవచ్చు. దాంతో విగ్రహం సులభంగా కనిపిస్తుంది. ఇలా పెడితే మీ ఇంటికి శుభం కలుగుతుంది. అలాగే ఇంటికి దక్షిణ దిశలో గణేశ విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. గణేశుడి విగ్రహాన్ని టాయిలెట్ దగ్గర లేదా బాత్రూమ్‌కు అటాచ్ చేసిన గోడ దగ్గర ఉంచకూడదు, ఎందుకంటే బాత్రూమ్ నుండి వెలువడే ప్రతికూల శక్తులు పూజ గది యొక్క సానుకూల వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

అదేవిధంగా ఎప్పుడు కూడా గణేష్ విగ్రహాన్ని మెట్ల క్రింద ఉంచకూడదు. ఎందుకంటే ప్రజలు మెట్ల మీదకు వెళ్తారు. వ్యక్తులు తమ తలపై అడుగు పెట్టడాన్ని ఎవరూ ఇష్టపడరు. దేవుడి మీద నడవడం వల్ల అరిష్టం. అలాగే పడకగదిలో గణేశుడి విగ్రహం పెట్టడం మంచిది కాదు. కానీ వేరే మార్గం లేకుంటే, విగ్రహాలను గదిలో ఈశాన్య మూలలో ఉంచి, మీరు పడుకునేటప్పుడు, మీరు మీ కాళ్ళను ఆ మూలలో ఉంచిన విగ్రహాల వైపుకు చాచకూడదు. ఇంట్లో ఎలాంటి వినాయక విగ్రహాలు పెట్టుకోవచ్చు? అన్న విషయానికి వస్తే.. మామిడి, గందం చెట్టు, వేప చెక్కతో చేసిన గణేశ విగ్రహాన్ని అదృష్టంగా భావిస్తారు. వాటిని తలుపు మీద ఉంచడం వల్ల సానుకూల శక్తి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పసుపుతో చేసిన వినాయక విగ్రహం వాస్తు ప్రకారం, పసుపుతో చేసిన గణేశ విగ్రహం మీ జీవితాన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. మీ ఇంట్లో ఈ విగ్రహం ఉంటే చాలా శుభప్రదం.