Vastu Tips: ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

చాలామంది ఇంట్లో అలంకరణ కోసం అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు సమస్యలను మెరుగుపరుచుకోవడం కోసం ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంట

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 07:30 PM IST

చాలామంది ఇంట్లో అలంకరణ కోసం అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు సమస్యలను మెరుగుపరుచుకోవడం కోసం ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే బుద్ధుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం మంచిదే కానీ, విగ్రహం పెట్టుకునే విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. చాలామందికి బుద్ధ విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి? ఏ దిశలో పెట్టాలి. ఇలాంటి చాలా విషయాలు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టకునేటప్పుడు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు అయినా కూడా బుద్ధుడి విగ్రహం ఇంట్లో పెట్టేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంచడం మంచిది.

ద్వారం దగ్గర ఉండే బుద్ధ విగ్రహం బయటి వచ్చే ప్రతికూల శక్తిని నిలువరిస్తుంది. దృష్టి నివారణకు ఇలా ప్రవేశ ద్వారం దగ్గర బుద్ధ విగ్రహం పెట్టుకోవాలి. ఇలా ఇంటి బయట పెట్టే విగ్రహం భూమి నుంచి 3,4 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి. అలాగే లివింగ్ రూమ్ లో కూడా బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ గదిలో ఉన్నపుడు పశ్చిమ దిక్కుగా దీన్ని అమర్చుకోవాలి. ఇది ఇంటిని ప్రశాంతంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండే టేబుల్ లేదా షెల్ఫ్ లో ఉంచాలి. బుద్ధ విగ్రహం వల్ల ఇల్లు శాంతిగా అందంగా కనిపిస్తుంది.

అలాగే బుద్ధుడి విగ్రహం ఎక్కడ పెట్టినా కూడా ఆ భూమి నుంచి కాస్త ఎత్తులోనే పెట్టడం మంచిది. తోట స్థలం ఉన్నవారు మొక్కల మధ్య బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ధ్యాన భంగిమలో ఉన్న విగ్రహం తోటలో పెట్టుకుంటే చాలా బావుంటుంది. అలాగే విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం కూడా తోటలో పెట్టుకోవడానికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.. కొంతమంది బుద్ధుడి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే యోగా, ధ్యానం సాధన చేసే చోట కూడా బుద్ధ విగ్రహం పెట్టుకోవచ్చు. ఇది ఏకాగ్రత పెంచుతుంది. ఇంట్లో తూర్పు భాగంలో బుద్ధ విగ్రహాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని అనిపిస్తే వారు చదువుకునే చోట ఒక బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యండి. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమంగా చదువు మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. బుద్ధుడి విగ్రహం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. కంటి చూపు కంటే పై స్థాయిలో ఉండే విధంగా ఏర్పుటు చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్ల వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానికి వస్తువుల దగ్గరగా పెట్టకూడదు. వీటి నుంచి వచ్చే వైబ్రేషన్ సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. విగ్రహం తూర్పు అభిముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు. స్టోర్ రూమ్, లాండ్రి గదుల వంటి చోట పెట్టకూడదు. తోటల్లో, ఆరుబైట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శుభ్రంగా ఉంచాలి. మురికి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.